Annadata Sukhibhava:అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్ పథకం జాబితాలో పేరు లేదా.. ఇదే ఆఖరి అవకాశం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అర్హుల జాబితాను సిద్ధం చేసి, రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది.
తాజాగా, అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 13వ తేదీలోపు అన్నదాత సుఖీభవ పోర్టల్ లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీ రావు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ నెల 13లోపు దరఖాస్తు చేయాలి
అన్నదాత సుఖీభవ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం. ఈ నెలలోనే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ మొదటి విడతగా మొత్తం రూ.7,000/- రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది.
అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేని రైతులు ఈ నెల 13లోపు అన్నదాత సుఖీభవ పోర్టల్ లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే, రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు అవసరమైన పత్రాలు సమర్పించాలని, పోర్టల్‌లోని గ్రీవెన్స్ మాడ్యూల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ఢిల్లీ రావు సూచించారు.
మూడు విడతల్లో నగదు జమ
ప్రభుత్వం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది:
తొలి విడత: జూలై 2025 – రూ.7,000/-
రెండవ విడత: నవంబర్ 2025 – రూ.7,000/-
మూడవ విడత: జనవరి 2026 – రూ.6,000/-
మొత్తం రూ.20,000/- మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుంది.
అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోం పేజీలో ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
పక్కన ఉన్న క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి.
స్క్రీన్‌పై లబ్ధిదారుడి వివరాలు, అర్హత, eKYC స్థితి కనిపిస్తాయి.
‘Eligible’ అని చూపిస్తే, రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ‘Ineligible’ అని చూపిస్తే, సమీప గ్రామ/వార్డు సచివాలయంలో వివరాలు తెలుసుకుని మళ్లీ దరఖాస్తు చేయాలి.
eKYC స్థితి ఇలా చెక్ చేసుకోండి
అన్నదాత సుఖీభవ పథకానికి eKYC తప్పనిసరి. దీని కోసం:
అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ను ఓపెన్ చేయండి.
‘eKYC’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
వచ్చిన OTPని ఎంటర్ చేసి ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి.
స్క్రీన్‌పై ‘eKYC Successful’ అని చూపిస్తే ప్రక్రియ పూర్తైనట్లు గుర్తించండి.

