DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope In telugu: జూలై 9 బుధవారం రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ ధనలాభం..

Today Horoscope In telugu: జూలై 9 బుధవారం రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ ధనలాభం.. ఈ రోజుల్లో మనలో చాలా మంది జాతకాలను నమ్ముతున్నారు. మరి కొంత మంది అసలు జాతకాలను అసలు నమ్మరు.

మేషం
ఈ రోజు అనుకూలంగా సాగుతుంది. వ్యాపారంలో పనులు సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు పురోగతి ఉంటుంది. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో చిన్న ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్తగా వ్యవహరించండి. మహిళల నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత బాగుంటాయి.

వృషభం
మిశ్రమ ఫలితాల రోజు. ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారంలో బిజీ షెడ్యూల్ ఉంటాయి. స్వల్ప అనారోగ్యం రావచ్చు. వాహన కొనుగోలు ప్రయత్నాలు సఫలం. స్నేహితుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం. ప్రముఖులతో పరిచయాలు, కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్త.

మిథునం
సంతృప్తికరమైన రోజు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు కలిసొస్తాయి. మిత్రులకు ఆర్థిక సాయం చేస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. విద్యార్థులకు ఒత్తిడి కొంచెం ఎక్కువ. ఆరోగ్యం అనుకూలం. కొన్ని పనులు ఆలస్యమవ్వచ్చు.

కర్కాటకం
ఉత్సాహభరితమైన రోజు. మహిళల ప్రయత్నాలు విజయవంతం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. శుభవార్తలు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. ఉద్యోగంలో పురోగతి, దూర ప్రయాణాలు లాభిస్తాయి. రాజకీయ రంగంలో లబ్ధి. వైవాహిక జీవితం సంతోషకరం. ట్రాఫిక్‌లో జాగ్రత్తగా ఉండండి.

సింహం
వైవాహిక జీవితం సుఖమయం. ఉదయం శుభవార్తలు. ముఖ్యమైన పనులు విజయవంతం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్న ఒడిదుడుకులు, బంధువులతో విభేదాలు రావచ్చు, జాగ్రత్తగా వ్యవహరణ. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మిత్రులకు ఆర్థిక సహాయం. వాహన కొనుగోలు సూచనలు.

కన్య
అంచనాలకు మించి ఆదాయం. రాజకీయ నాయకులకు అధికార యోగం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెండింగ్ పనులు పూర్తి. పిల్లల నుంచి శుభవార్తలు, విదేశాల నుంచి సమాచారం. తల్లిదండ్రుల సహకారం. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపార దూర ప్రయాణాలు, అనుకోని అతిథుల రాకతో సంతోషం.

తుల
ఉద్యోగంలో పదోన్నతి అవకాశం. వ్యాపారాలు లాభదాయకం. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు. అనారోగ్యం నుంచి ఉపశమనం. నమ్మినవారి మోసం జాగ్రత్త. మహిళలకు శుభవార్తలు. ఆస్తి కొనుగోలు సూచనలు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం.

వృశ్చికం
ఉద్యోగంలో హోదా, సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సుఖమయం. కుటుంబంలో మీ సలహాలకు విలువ. వ్యాపారాలు స్థిరంగా సాగుతాయి. అనుకున్న పనులు పూర్తి. బిజీ షెడ్యూల్, ఖర్చులు పెరగవచ్చు.

ధనుస్సు
ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుంచి శుభ సమాచారం. ఉద్యోగ మార్పు అవకాశం. సమాజంలో ప్రాభవం పెరుగుతుంది. అన్ని రంగాల్లో పురోగతి. అనారోగ్యం నుంచి కోలుకోవడం, పెట్టుబడులు లాభిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు. రాదనుకున్న డబ్బు చేతికి. కోరికలు నెరవేరుతాయి.

మకరం
ప్రశాంతమైన రోజు. శుభవార్తలు వినే అవకాశం. ఉద్యోగంలో గుర్తింపు, కానీ సహోద్యోగుల నుంచి ఇబ్బందులు. స్వల్ప అనారోగ్య సూచనలు. అనవసర ఖర్చులు జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు కలిసొస్తాయి. కుటుంబ జీవితం సంతోషకరం.

కుంభం
విదేశీ ఉద్యోగం/చదువులకు అవకాశం. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. పిల్లలు చదువుల్లో పురోగతి. రాజకీయంగా పలుకుబడి. కొంచం ఒత్తిడి ఎక్కువ. కుటుంబ సమస్యల నుంచి విముక్తి. బంధువులతో విభేదాలు జాగ్రత్త. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

మీనం
దూకుడు, సాహసాలు తగ్గించుకోండి. అధికారులతో ఘర్షణలు రావచ్చు. ఆరోగ్యం, జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. డ్రైవింగ్‌లో ప్రమాదాలు జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ