Business

Business Ideas: మహిళలు కేవలం రూ. 1500 రూపాయలతో ఈ కోర్సు నేర్చుకుంటే.. నెలకు లక్ష సంపాదన..

Business Ideas: మహిళలు కేవలం రూ. 1500 రూపాయలతో ఈ కోర్సు నేర్చుకుంటే.. నెలకు లక్ష సంపాదన.. వ్యాపారం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారా, కానీ ఏ వ్యాపారం చేయాలో తెలియడం లేదా? అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సెట్విన్ సంస్థ అందించే కొన్ని కోర్సులను నేర్చుకోవడం ద్వారా మీరు సొంత వ్యాపారం ప్రారంభించి మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. కేవలం 1500 రూపాయలతో ఒక కోర్సు నేర్చుకుని నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళలు ఇంటి నుంచే ఆదాయం పొందాలనుకుంటున్నారా? అయితే ఒక లాభదాయకమైన బిజినెస్ ఐడియా గురించి తెలుసుకోండి. ఈ వ్యాపారం ద్వారా మీరు ఇంట్లో ఉంటూ, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఆదాయం సంపాదించవచ్చు. ముఖ్యంగా, మహిళలు ఇంటి పనులతో పాటు ఖాళీ సమయంలో చేయగలిగే ఒక వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జంట నగరాల్లోని యువతకు సెట్విన్ సంస్థ ఉపాధి శిక్షణా కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ఇస్తారు, వీటిని ఉపయోగించి ఉద్యోగాలు పొందవచ్చు లేదా సొంత వ్యాపారం ప్రారంభించవచ్చు. సెట్విన్‌లో తక్కువ ఫీజుతో వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవచ్చు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మగ్గం వర్క్ శిక్షణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో మగ్గం వర్క్‌తో రూపొందించిన దుస్తులకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మగ్గం వర్క్‌ను జర్దోసీ వర్క్ అని కూడా అంటారు. ఈ వర్క్‌తో తయారైన చీరలు, గాగ్రా చోళీలు, బ్లౌజులకు మంచి డిమాండ్ ఉంది. సెట్విన్ సంస్థలో కేవలం 1500 రూపాయలతో ఈ కోర్సును నేర్చుకోవచ్చు. ఈ కోర్సు సులభంగా నేర్చుకోగలిగే విధంగా ఉంటుంది మరియు ప్రస్తుతం దీనికి గొప్ప డిమాండ్ ఉంది.

ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మగ్గం వర్క్ చేయడం ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. మగ్గం వర్క్‌తో తయారైన బ్లౌజులు, ఇతర దుస్తులకు కనీసం 3,000 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో ఈ వ్యాపారం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఒంటరిగా కాకుండా ఒక గ్రూప్ గా కలిసి ఈ వర్క్ చేస్తే మరింత ఆదాయం పంచుకోవచ్చు. అలాగే, ఈ నైపుణ్యం ఉంటే బోటిక్‌లలో మంచి వేతనంతో ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది.

Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూలేదా ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల ఫలితాలకు chaipakodi బాధ్యత వహించదు. డబ్బు, పెట్టుబడి, వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలని chaipakodi సూచిస్తుంది.