Beauty Tips

Dark Circles:కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బందిపడుతున్నారా..? ఈ సింపుల్‌ టిప్స్‌తో మీ అందం రెట్టింపు

Dark Circles:కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బందిపడుతున్నారా..? ఈ సింపుల్‌ టిప్స్‌తో మీ అందం రెట్టింపు.. కళ్ళ కింద నల్లటి వలయాలను తొలగించడానికి కొన్ని సులభమైన చిట్కాలు… పెరిగిపోతున్న ఒత్తిడి, తగ్గుతున్న నిద్ర వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు సాధారణంగా ఏర్పడతాయి. టీనేజ్ అమ్మాయిల నుంచి అన్ని వయసుల వారిని ఇబ్బంది పెట్టే ఈ నల్లటి వలయాలను తగ్గించడానికి సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

మేకప్ వేసుకునే ముందు కళ్ళ కింద మంచి మాయిశ్చరైజర్ రాయండి. ఇది చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

నల్లటి వలయాలు ఉన్నవారు ఫౌండేషన్ రాసే ముందు ప్రైమర్ వాడితే మంచిది. ఇది నలుపును కప్పిపుచ్చి చర్మాన్ని సమానంగా కనిపించేలా చేస్తుంది.

నల్లటి వలయాలు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ మేకప్ వాడండి. ఎక్కువ మేకప్ వల్ల నల్లటి వలయాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.

కన్సీలర్ వాడేవారు స్కిన్ టోన్‌కు సరిపడే లేత బూడిద రంగు కన్సీలర్‌ను ఎంచుకోవాలి. ముదురు రంగు కన్సీలర్ నల్లటి వలయాలను మరింత హైలైట్ చేస్తుంది.

కన్సీలర్ మీ ఫౌండేషన్ కంటే ఒకటి లేదా రెండు షేడ్స్ లైట్‌గా ఉండాలి. క్రీమ్ రకం కన్సీలర్‌ను నెమ్మదిగా కళ్ళ కింద రాయడం వల్ల మేకప్ ప్యాచ్‌లా కనిపించదు.

మేకప్ తీసిన తర్వాత చల్లని నీటిలో ముంచిన మృదువైన వస్త్రాన్ని కళ్ళపై 10 నిమిషాలు ఉంచితే చర్మం రిఫ్రెష్ అవుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ