Stocks to Watch: జూలై 10వ తేదీ గురువారం.. ఒక లుక్ వేయాల్సిన స్టాక్స్..
Stocks to Watch: జూలై 10వ తేదీ గురువారం.. ఒక లుక్ వేయాల్సిన స్టాక్స్.. ఈ రోజు, జూలై 10, 2025, గురువారం, స్టాక్ మార్కెట్‌లో కొన్ని స్టాక్స్ వివిధ కారణాల వల్ల వార్తల్లో ప్రముఖంగా నిలిచాయి. ఫలితంగా, ఈ స్టాక్స్ ట్రేడింగ్‌లో వేగంగా కదిలే అవకాశం ఉంది. కాబట్టి, పెట్టుబడిదారులు ఈ స్టాక్స్‌పై దృష్టి పెట్టడం మంచిది.
Ambuja Cements: అంబుజా సిమెంట్స్ అనుబంధ సంస్థ ఎసిసి లిమిటెడ్, ఝార్ఖండ్‌లోని సింద్రీ ప్లాంట్‌లో 15 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన బ్రౌన్‌ఫీల్డ్ గ్రైండింగ్ యూనిట్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది.
Indosolar: Waaree Energies Limited తమ అనుబంధ సంస్థ ఇండోసోలార్‌లో ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా 10 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నట్లు తెలిపింది. ఒక్కో షేరు ధర రూ.265గా నిర్ణయించారు. ఈ షేర్లు జూలై 11 నుంచి రిటైల్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటాయి.
RailTel Corporation: ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి రూ.17.47 కోట్ల విలువైన కొత్త ఒప్పందం లభించింది.
Enviro Infra: మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MIDC) నుంచి ఈ సంస్థకు రూ.395 కోట్ల విలువైన ఆర్డర్ అందింది.
Emcure Pharmaceuticals:గుజరాత్ లోని సనంద్ లో ఉన్న కంపెనీ ఆంకాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో తనిఖీలు పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ తనిఖీల్లో సంస్థకు ఫారం 483 జారీ కాలేదు.
BhartiAirtel : సంస్థ తాజాగా ఎయిర్‌టెల్ మనీ లిమిటెడ్ పేరిట కొత్త కంపెనీని రూ.1 లక్ష పెయిడ్-అప్ క్యాపిటల్‌తో ప్రారంభించినట్లు తెలిపింది.
Muthoot Capital:ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ రూ.125 కోట్ల విలువైన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా జారీ చేయడానికి ఆమోదించింది.
Dai-ichi Karkaria :: గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.3.5 డివిడెండ్ చెల్లించాలని సంస్థ నిర్ణయించింది. దీనికి ఆగస్టు 13ని రికార్డ్ తేదీగా నిర్ణయించింది.
Disclaimer: ఈ సమాచారం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోబడి ఉంటాయి. మీ పెట్టుబడుల లాభనష్టాలకు chaipakodi ఎలాంటి బాధ్యత వహించదు. chaipakodi పాఠకులకు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలని సూచిస్తుంది.

