Tirumala:శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు… భక్తులకు సూచనలు..
Tirumala Tirupati:తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2, 2025 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి గురువారం అన్నమయ్య భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించి, అన్ని ఏర్పాట్లను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విభాగాల వారీగా సమీక్ష జరిపి, పలు సూచనలు చేశారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
16-09-2025: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
23-09-2025: బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
24-09-2025: ధ్వజారోహణం.
28-09-2025: గరుడ వాహనం.
01-10-2025: రథోత్సవం.
02-10-2025: చక్రస్నానం.
వాహన సేవలు: ప్రతిరోజూ ఉదయం 8:00 నుండి 10:00 గంటల వరకు, సాయంత్రం 7:00 నుండి 9:00 గంటల వరకు.
దర్శనం రద్దు: భక్తుల రద్దీ దృష్ట్యా, ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు రద్దు.
భద్రత & ట్రాఫిక్: విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్యల నివారణకు రోడ్ మ్యాప్‌లు, పార్కింగ్ ఏర్పాట్లు.
అన్న ప్రసాదం: దర్శన క్యూలైన్లు, మాడ వీధుల గ్యాలరీలు, ముఖ్య ప్రాంతాల్లో అన్న ప్రసాదం విరివిగా పంపిణీ.
ఇంజనీరింగ్ పనులు: భక్తుల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలి.
పరిశుభ్రత: గ్యాలరీల్లో మరుగుదొడ్ల పరిశుభ్రత కోసం అదనపు సిబ్బంది నియామకం.
అలంకరణ: భక్తులను ఆకర్షించేలా విద్యుత్ అలంకరణలు, ఫల-పుష్ప ప్రదర్శనలు.
సేవకులు: యువతీ యువకులను శ్రీవారి సేవకులుగా ఆహ్వానించి మెరుగైన సేవలు అందించాలి.
ద్విచక్ర వాహన నిషేధం: 27-09-2025 రాత్రి 9:00 నుండి 29-09-2025 ఉదయం 6:00 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు నిషేధం.
లడ్డూ నిల్వ: భక్తుల రద్దీకి తగినట్లు లడ్డూల నిల్వ ఏర్పాటు.
సమావేశంలో పాల్గొన్నవారు: డీఎఫ్‌వో ఫణి కుమార్ నాయుడు, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శేషారెడ్డి, సీపీఆర్వో డా. టి. రవి, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, రాజేంద్ర, సోమన్నారాయణ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, టీటీడీ ఆల్ ప్రాజెక్ట్స్ ఆఫీసర్ రాజగోపాల్, ఈఈలు సుబ్రహ్మణ్యం, వేణు గోపాల్, డిఈ చంద్ర శేఖర్, అశ్వినీ ఆసుపత్రి సివిల్ సర్జన్ కుసుమ కుమారి, ఎస్వీబీసీ ఓఎస్డీ పద్మావతి, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి జీ.ఎల్.ఎన్. శాస్త్రి, ఇతర అధికారులు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

