Gold Rate Today: భారీగా తగ్గుతున్న బంగారం ధర… దాదాపుగా రూ. 5000 పతనం…
Gold Rate Today:బంగారం ధర నిన్నటితో పోలిస్తే నీటి రోజున స్వల్పంగా తగ్గినట్లు గమనించవచ్చు. జూలై 12, 2025, శనివారం నాడు బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,650, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,750, మరియు ఒక కిలో వెండి ధర రూ. 1,20,000గా ఉంది. బంగారం ధరల తగ్గుదలకు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు కారణమని నిపుణులు తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం దేశీయ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతోంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర ఒక్కొక్క ఔన్స్‌కు 3,250 డాలర్ల స్థాయికి పడిపోయింది. అదే విధంగా, ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఆగస్టు 5 నాటి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర రూ. 97,830గా నమోదైంది.
ఇది కూడా బంగారం ధరల తగ్గుదలకు ఒక కారణంగా చెప్పవచ్చు. అదన్నట్టు, డాలర్ విలువ బలపడటం కూడా బంగారం ధర తగ్గడానికి మముఖ కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా, డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది.
మరోవైపు, బంగారం ధరలతో పోలిస్తే వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. వెండి ధర ప్రస్తుతం ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిని అందుకుంది. గత ఏడాది కాలంలో వెండి ధర సుమారు 25% పెరిగినట్లు గమనించవచ్చు. ఈ పెరుగుదలకు మార్కెట్‌లో వెండి డిమాండ్ గణనీయంగా పెరగడమే ప్రధాన కారణం.
పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు వంటి రంగాల్లో వెండి వినియోగం పెరుగుతుండటం వల్ల డిమాండ్ బాగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా, ఒక కిలో వెండి ధర రూ. 1.20 లక్షలను దాటింది.
బంగారంతో పోలిస్తే వెండి ధర తక్కువగా ఉన్నప్పటికీ, వెండి ధర పెరుగుదల వేగం బంగారం కంటే ఎక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వెండిలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని చెప్పవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

