Today Horoscope:జూలై 12 శనివారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి వద్దన్నా డబ్బే..
Today Horoscope:జూలై 12 శనివారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి వద్దన్నా డబ్బే.. నేడు జూలై 12, 2025, శనివారం. చాంద్రమానం ప్రకారం ఆషాఢ మాసం, విదియ తిథి (రాత్రి 1:44 వరకు), తర్వాత తదియ, ఉత్తరాషాఢ నక్షత్రం (ఉదయం 6:28 వరకు), తర్వాత శ్రవణ నక్షత్రం. వర్జ్యం: ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. చంద్రుడి శుభ దృష్టి కారణంగా 6 రాశుల వారికి అనుకోని శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ద్వాదశ రాశులకు ఈ రోజు ఫలితాలు ఇలా ఉన్నాయి:
మేషం
ఈ రాశి వారికి నీడు అత్యంత అనుకూలంగా ఉంది. శుక్రుడి శుభ దృష్టి వల్ల తలపెట్టిన పనులు సఫలమవుతాయి. మీ మాటకు తిరుగులేదు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు, ప్రైవేటు ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. విందు-వినోదాల్లో పాల్గొంటారు. అమ్మవారికి కుంకుమ పూజ చేయండి, కోరిన కోర్కెలు నెరవేరతాయి. లక్కీ నెంబర్: 8, లక్కీ కలర్: తెలుపు
వృషభం
మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. గ్రహబలం కొంత తక్కువగా ఉన్నప్పటికీ, చంద్రుడి శుభ దృష్టి వల్ల కొంత మేలు జరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా, అనుకోని ఆర్థిక లాభాలు కలిసొస్తాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఒక వ్యక్తి వల్ల ఇబ్బందులు రావచ్చు. స్పెక్యులేషన్, అప్పులకు దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. లక్కీ నెంబర్: 5, లక్కీ కలర్: ఎరుపు
మిథునం
శుభకాలం నడుస్తోంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. వ్యాపారులకు, ఉద్యోగులకు శుభ ఫలితాలు. అనుకోని ధనలాభం సూచితం. పెట్టుబడులకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చించకండి. విద్యార్థులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రాజకీయ నాయకులకు అనుకూలం. విష్ణు సహస్రనామ జపం, తులసిమాల సమర్పణ చేయండి. లక్కీ నెంబర్: 3, లక్కీ కలర్: పసుపు, తెలుపు
కర్కాటకం
గురుడి శుభ దృష్టి వల్ల పనులు విజయవంతంగా సాగుతాయి. మానసిక ఆనందం లభిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం. ఆర్థికంగా అనుకూలం. మిత్రుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు, బంగారం పెట్టుబడులకు మంచి సమయం. శత్రు బాధలు తొలగుతాయి. అంజనేయస్వామి దర్శనం చేయండి. లక్కీ నెంబర్: 9, లక్కీ కలర్: ఎరుపు
సింహం
శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పటికీ, శని 8వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ, పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతో విరోధం రాకుండా జాగ్రత్తపడండి. భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం. ఆంజనేయస్వామి ఆకుపూజ చేయించండి. లక్కీ నెంబర్: 9, లక్కీ కలర్: పసుపు
కన్య
బుధుడి శుభ దృష్టి వల్ల ఉత్తర దిక్కు ప్రయాణాలు కలిసొస్తాయి. వ్యాపారులకు అనుకూలం. ద్విచక్ర వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఒక వస్తువు కోల్పోయే అవకాశం ఉంది. ఉద్యోగ శుభవార్తలు వింటారు. ఆదాయం బాగుంటుంది. జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు. రియల్ ఎస్టేట్, విహార యాత్రలకు అనుకూలం. వెంకటేశ్వర స్వామి దర్శనం చేయండి. లక్కీ నెంబర్: 6, లక్కీ కలర్: ఆకుపచ్చ
తుల
చంద్రుడి శుభ దృష్టి వల్ల ఆర్థికంగా కలిసొస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విందు-వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారం, ఉద్యోగులకు అధికారుల అండ లభిస్తుంది. ప్రమోషన్లకు అనుకూలం. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మొండి బాకీలు వసూలవుతాయి. ఒక పెద్ద మొత్తం చేతికి వస్తుంది, సరిగ్గా పెట్టుబడి చేయండి. శ్రీరామరక్షా స్తోత్రం జపించండి. లక్కీ నెంబర్: 6, లక్కీ కలర్: ఎరుపు
వృశ్చికం
గ్రహబలం తక్కువగా ఉంది. ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులు ఎదురవ్చు. ఆహారంలో జాగ్రత్త అవసరం. స్పెక్యులేషన్, వివాదాలు, అప్పులకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు, విద్యార్థులకు అనుకూలం. ఖర్చులపై శ్రద్ధ వహించండి. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం కాదు. శివాలయంలో పరమేశ్వరుడికి పాలు సమర్పించండి. లక్కీ నెంబర్: 7, లక్కీ కలర్: నీలం
ధనుస్సు
గ్రహబలం బాగుంది. ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపారులకు లాభాలు. ఆర్థిక పురోగతి, ఉద్యోగ స్థిరత్వం లభిస్తాయి. విందు-వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు నియంత్రించండి. ఆస్తి వివాదంలో పరిష్కారం లభిస్తుంది. రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం. గణపతికి గరిక సమర్పించండి. లక్కీ నెంబర్: 6, లక్కీ కలర్: పసుపు
మకరం
మిశ్రమ ఫలితాలు. ఇంటా-బయటా ఒత్తిళ్లు ఎదురవ్చు. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. డాక్టర్లు, లాయర్లు, వృత్తి నిపుణులకు బిజీగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. కాలభైరవాష్టకం జపించండి. లక్కీ నెంబర్: 3, లక్కీ కలర్: నలుపు
కుంభం
నవగ్రహాల అనుకూల దృష్టి ఉంది. తలపెట్టిన పనులు నెరవేరుతాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు అనుకూలం. కొత్త వాహనాలు, బంగారం కొనుగోలుకు మంచి సమయం. విందు-వినోదాల్లో పాల్గొంటారు. వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు పూలు సమర్పించండి. లక్కీ నెంబర్: 11, లక్కీ కలర్: పసుపు
మీనం
గురు-శుక్రుల అనుగ్రహం వల్ల అన్ని శుభాలే జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. బంధుమిత్రులతో విందు-వినోదాలు. ఆర్థిక పురోగతి, జీవిత భాగస్వామి వల్ల శుభవార్త. శత్రువులపై విజయం. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు అనుకూలం. సుబ్రహ్మణ్యస్వామి దర్శనం చేయండి. లక్కీ నెంబర్: 8, లక్కీ కలర్: ఎరుపు
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

