BusinessToday gold rate

Gold Rate Today: జూలై 13, ఆదివారం బంగారం ధరలు ఇవే… ఎలా ఉన్నాయో చూడండి..

Gold Rate Today: జూలై 13, ఆదివారం బంగారం ధరలు ఇవే… ఎలా ఉన్నాయో చూడండి.. బంగారం ధరలు భారీగా పెరిగాయి, పసిడి ధరలు మరోసారి ఆల్-టైం గరిష్ఠ స్థాయి వైపు దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి,

దీంతో బంగారు ఆభరణాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సందర్భంలో, ఈ రోజు మీరు బంగారం కొనుగోలు చేయడానికి వెళ్తున్నట్లయితే, నీటి ధరలను తెలుసుకోవడం అత్యవసరం. అలాగే, బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, దానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

ఈ రోజు, జూలై 13, 2025, ఆదివారం నాడు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి:

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,900.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,800.
1 కేజీ వెండి ధర రూ. 1,18,000.

బంగారం ధరలు ఆల్-టైం రికార్డ్ స్థాయి వైపు పరుగులు తీస్తున్నాయి. దీనికి అంతర్జాతీయ పరిస్థితులే కీలక కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, అమెరికా స్టాక్ మార్కెట్లలో నష్టాలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని ప్రధాన సూచీలైన డౌజోన్స్ శుక్రవారం 0.63% నష్టపోగా, S&P 500 సూచీ 0.33%, నాస్డాక్ సూచీ 0.22% నష్టపోయాయి.

దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్‌ను మరింత తీవ్రతరం చేయడం. ట్రంప్ ఇటీవల కెనడాపై 35% టారిఫ్ విధించారు, త్వరలో మరికొన్ని దేశాలపై 20% టారిఫ్ విధించనున్నట్లు హెచ్చరించారు. ఈ టారిఫ్‌ల వల్ల ట్రేడ్ వార్ మరింత ముదిరి, అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని, సుంకాల కారణంగా దిగుమతి వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ అంతర్జాతీయ పరిణామాల ఫలితంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో దాని ధర ఆల్-టైం గరిష్ఠ స్థాయిని తాకింది.

ఇదే సమయంలో, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి, ఆల్-టైం రికార్డ్ స్థాయిని దాటి ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ. 1,20,000 వద్ద ట్రేడ్ అవుతోంది. చరిత్రలో వెండి ధర ఇంత స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి.

వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పారిశ్రామిక డిమాండ్ పెరగడమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులోనూ వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. దీంతో, ఇన్వెస్టర్లు వెండిలో పెట్టుబడులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ