DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు… ఈ రాశి వారు శుభవార్తలు వింటారు..

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు… ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు. అయితే జాతకాలను నమ్మని వారు కూడా ఉన్నారు.

మేషం
శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఒక సంతోషకరమైన వార్త మీకు ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రుల సహకారంతో చేసే కార్యక్రమాలు సఫలమవుతాయి. ఒక ముఖ్యమైన విషయంలో మీరు కోరుకున్న పురోగతి సాధ్యమవుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం మంచిది.

వృషభం
ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మబద్ధత మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేరుస్తుంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవవచ్చు. ఆహార నియమాలను కచ్చితంగా పాటించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం శుభప్రదం.

మిథునం
మీ రంగంలో కొన్ని అడ్డంకులు ఎదురైనా, వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. బంధువులతో సౌహార్దం ఉంటుంది. ఒక ముఖ్యమైన పనిలో పురోగతి కనిపిస్తుంది. శుభవార్త వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గోసేవ చేయడం శుభం.

కర్కాటకం
ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు, ఆశీస్సులు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు సంభవించవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నవగ్రహ స్తోత్రం చదవడం మంచి ఫలితాలనిస్తుంది.

సింహం
ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పజెబుతారు. మానసిక దృఢత్వం ఉంటుంది. బంధువుల ఇళ్లలో ఆతిథ్యం, శుభ భోజనం లభిస్తాయి. కీలక విషయాల్లో శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఇష్టదైవ నామస్మరణ శుభప్రదం.

కన్య
మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఒక ముఖ్యమైన వ్యవహారంలో సహచరుల సహాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందుతుంది. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

తుల
ఏ పని చేపట్టినా సులభంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో మీరు కోరుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. ఇష్టదైవ ఆరాధన శుభకరం.

వృశ్చికం
శారీరక శ్రమ కొంత ఎక్కువగా ఉంటుంది. బంధువులతో వివాదాలకు దిగకపోవడమే మంచిది. అనవసర ఖర్చులు జరిగే సూచన ఉంది. అధికారులను సంతృప్తిపరచడానికి కొంత కష్టపడాలి. ఏ పరిస్థితిలోనూ దైవారాధనను విడిచిపెట్టవద్దు.

ధనుస్సు
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగించవచ్చు. చంచలమైన ఆలోచనలతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. గోసేవ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

మకరం
శుభ సమయం. దీర్ఘదృష్టితో ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. రుణ సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. ఇష్టదేవతా ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.

కుంభం
మనోధైర్యంతో మీ లక్ష్యాలను సాధిస్తారు. ఒక పనిలో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ధన, వస్త్ర లాభాలు కనిపిస్తాయి. ఇష్టదేవతా శ్లోకాలు పఠించడం శుభప్రదం.

మీనం
ప్రారంభించిన కార్యక్రమాలు సులభంగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణం మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ