Business

Pension:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి పింఛన్‌ పునరుద్ధరణ..

Pension:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి పింఛన్‌ పునరుద్ధరణ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో భూమి లేని పేదలకు పింఛన్లను పునరుద్ధరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో 1,575 కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించారు. వీటిలో అమరావతి ప్రాంతానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఉన్నాయి. అమరావతిలోని నేలపాడులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న నివాస సముదాయం పనులను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

దీనికోసం రూ. 524.70 కోట్లు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, సీఆర్‌డీఏ పరిధిలో వివిధ భూకేటాయింపులను సమీక్షించే ప్రతిపాదనను కూడా ఆమోదించింది. అంతేకాక, గత ప్రభుత్వం రద్దు చేసిన 1,575 పింఛన్లను పునరుద్ధరించేందుకు కూడా ఆమోదం లభించింది.

ఈ నేపథ్యంలో, అమరావతి రాజధాని నిర్మాణంలో జీవనోపాధి కోల్పోయిన 1,575 కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కుటుంబాలను 2015లో ఇంటింటి సర్వే ద్వారా పింఛన్లకు అర్హులుగా గుర్తించారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం ఈ పింఛన్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ