Business

Free Coaching For Exams:ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..

Free Coaching For Exams: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు సంతోషకరమైన వార్తను ప్రకటించింది. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా ఎస్సీ, ఎస్టీ యువతకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపింది. ఈ శిక్షణ విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ కేంద్రాల్లో అందుబాటులో ఉంటుందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.

మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో ఎస్సీ హాస్టల్ వార్డెన్లు, గురుకుల ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా బ్యాంక్ పీవో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలకు త్వరలో విశాఖ, తిరుపతి, విజయవాడ కేంద్రాల్లో శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.

గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చూడాలని వార్డెన్లకు ఆదేశించారు.

గురుకులాలు, వసతిగృహాల్లోని ఖాళీలను భర్తీ చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను గురుకులాల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రవేశాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఎస్సీ వసతిగృహాలు, గురుకులాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, వసతిగృహాల మరమ్మతుల కోసం రూ. 143 కోట్లు కేటాయించామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తున్నామని తెలిపారు.

ప్రతి జిల్లాకు ఒక హెల్త్ ఆఫీసర్‌ను నియమించినట్లు, అనారోగ్యంతో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు సాంత్వన పథకం కింద రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్ల సంఖ్యను 10కి పెంచినట్లు తెలిపారు. ఎస్సీ హాస్టళ్లలో ట్యూటర్ల నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు, అంబేద్కర్ విగ్రహాల స్థాపన, విద్యార్థులకు కాస్మెటిక్ కిట్ల పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ