Face Glow: ఖరీదైన క్రీములు అవసరం లేదు.. ఇలా చేస్తే తెల్లని అందమైన ముఖం మీ సొంతం..
Face Glow: ఖరీదైన క్రీములు అవసరం లేదు.. ఇలా చేస్తే తెల్లని అందమైన ముఖం మీ సొంతం.. చాలా మంది అమ్మాయిలు మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మన వంటిల్లో సులభంగా దొరికే కొన్ని పదార్థాలను ముఖానికి రాస్తే, మీ అందం రెట్టింపు అవుతుంది, చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.
ప్రతి ఒక్కరూ తమ ముఖం మెరిసేలా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం చాలా మంది ఖరీదైన క్రీములు, ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తారు. అయినప్పటికీ, కొందరికి ఎన్ని క్రీములు రాసినా ముఖంలో గ్లో రాదు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారిలో ముఖం నిస్తేజంగా కనిపిస్తుంది. అలాంటి వారికి, వంటిల్లో లభించే కొన్ని సహజ పదార్థాలతో చర్మ సమస్యలను తగ్గించి, ముఖాన్ని మెరుగుపరచవచ్చు.
1. ఓట్‌మీల్, పాలు:
ఓట్‌మీల్, పాలతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ చనిపోయిన చర్మ కణాలను తొలగించి, ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఓట్‌మీల్ పొడి తీసుకుని, అందులో కొద్దిగా పాలు కలిపి మెత్తని పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాసి 5 నిమిషాలు మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయండి.
2. పసుపు, పెరుగు:
పసుపు, పెరుగు కలిపిన ఫేస్ ప్యాక్ ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఒక గిన్నెలో అర టీస్పూన్ పసుపు పొడి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి, ముఖం, మెడపై రాయండి. 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ ఉపయోగిస్తే ముఖం మెరుస్తుంది.
3. బొప్పాయి, తేనె:
బొప్పాయిని మెత్తగా చేసి, అందులో కొద్దిగా తేనె కలిపి ముఖం, మెడపై రాసి 20 నిమిషాలు మసాజ్ చేయండి. తర్వాత నీటితో ముఖాన్ని కడిగి, మాయిశ్చరైజర్ రాయండి. వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే చర్మంలోని మురికి తొలగి, ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
4. కలబంద, కీర దోసకాయ:
కలబంద జెల్, కీర దోసకాయ పేస్ట్‌ను కలిపి ముఖం, మెడపై రాయండి. 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి. ఈ మిశ్రమం చర్మాన్ని తేమగా ఉంచుతుంది మరియు మొటిమలు వంటి సమస్యలను నివారిస్తుంది.
5. ముల్తానీ మట్టి, టమోటా రసం:
1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, టమోటా రసాన్ని కలిపి ముఖానికి రాయండి. 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే నల్ల మచ్చలు తొలగి, చర్మం బిగుతుగా, ప్రకాశవంతంగా మారుతుంది.
ఈ సహజ పద్ధతులతో మీ చర్మ సమస్యలను తగ్గించుకుని, ముఖాన్ని మెరుగుపరచుకోవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

