Skin Care Tips:మందారపూలతో ఇలా చేస్తే ముఖం మిలమిలా మెరిసిపోతుంది..
Skin Care Tips:మందారపూలతో ఇలా చేస్తే ముఖం మిలమిలా మెరిసిపోతుంది..మందారపూలతో తయారు చేసిన క్రీమ్‌ను రోజూ ముఖానికి రాసుకుంటే మీ ముఖం యవ్వనంగా, మెరిసేలా మారుతుంది.మందారపూలు దాదాపు అందరికీ సులభంగా దొరుకుతాయి. చాలా మంది వీటిని జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ పూలు ముఖాన్ని అందంగా మార్చడంలో కూడా గొప్పగా సహాయపడతాయి.
ఇంట్లోనే మందారపూలతో క్రీమ్ తయారు చేసుకుంటే, రోజూ వాడటం వల్ల ముఖంలో కాంతి పెరుగుతుంది, యవ్వనంగా కనిపిస్తారు, మొటిమల సమస్య తగ్గుతుంది, మొటిమల వల్ల వచ్చే నల్ల మచ్చలు కూడా సులభంగా తొలగిపోతాయి. ఈ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం…
కావాల్సిన పదార్థాలు:
ఎర్ర మందారపూలు: 10
విటమిన్ E క్యాప్సూల్స్: 2
గ్లిజరిన్: 1 టీస్పూన్
రోజ్ వాటర్: 1 టీస్పూన్
తయారీ విధానం:
10 మందారపూల రేకులను తీసి, శుభ్రంగా నీటితో కడగాలి.ఒక గ్లాసు నీటిలో రేకులను వేసి, స్టవ్‌పై బాగా మరిగించాలి.మరుగుతున్నప్పుడు గులాబీ రంగు చిక్కటి జెల్ తయారవుతుంది. దీనిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి.చల్లారిన తర్వాత, రెండు విటమిన్ E క్యాప్సూల్స్‌లోని ద్రవాన్ని, గ్లిజరిన్, రోజ్ వాటర్ కలపాలి.ఈ మిశ్రమాన్ని గాజు కంటైనర్‌లో నిల్వ చేసి, ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఉపయోగం:
ప్రతి రాత్రి పడుకునే ముందు ముఖాన్ని నీటితో శుభ్రం చేసి, ఈ క్రీమ్ రాయాలి.ఉదయం ముఖాన్ని మళ్లీ నీటితో కడగాలి.ఈ క్రీమ్‌ను చేతులు, మెడకు కూడా రాయవచ్చు. స్నానానికి అరగంట ముందు కూడా అప్లై చేయొచ్చు.రెగ్యులర్‌గా వాడితే ముఖం అందంగా, మృదువుగా మారుతుంది.
విటమిన్ E ప్రయోజనాలు:
విటమిన్ E క్యాప్సూల్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తాయి. ఇవి మొటిమలు, నల్ల మచ్చలు, బ్లాక్‌హెడ్స్, డెడ్ స్కిన్ సెల్స్, ట్యాన్ తొలగించడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి.
మందారపూల ప్రయోజనాలు:
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, మందారపూలలో కొల్లాజెన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి సహజమైన గులాబీ రంగును ఇస్తాయి, మొటిమలు, UV కిరణాల నుండి రక్షిస్తాయి, చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి.
గ్లిజరిన్ ప్రయోజనాలు:
గ్లిజరిన్ చర్మం పొడిబారకుండా, తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచుతుంది.
మందారపూలు, విటమిన్ E, గ్లిజరిన్ కలిపి తయారు చేసిన ఈ క్రీమ్ రెగ్యులర్‌గా ఉపయోగిస్తే మీ చర్మం అందాన్ని రెట్టింపు చేస్తుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

