DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope:జూలై 16 బుధవారం రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ అదృష్టం ఎక్కువ..

Today Horoscope:జూలై 16 బుధవారం రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ అదృష్టం ఎక్కువ.. నేడు జూలై 16, 2025, బుధవారం, ఆషాఢ మాసం, షష్ఠి తిథి (రాత్రి 8:59 వరకు), తర్వాత సప్తమి. నక్షత్రం: ఉత్తరాభాద్ర (తెల్లవారుజాము 4:40 వరకు), తర్వాత రేవతి (తెల్లవారుజాము 5:46 వరకు). వర్జ్యం: మధ్యాహ్నం 2:59 నుండి 4:31 వరకు. శని వక్ర దృష్టి, చంద్రుడి ప్రభావం వల్ల కొన్ని రాశులకు ఊహించని శుభ ఫలితాలు, అలాగే శని ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారికి పరిహారాలు సూచించబడ్డాయి. చాంద్రమాన ద్వాదశ రాశుల ఈ రోజు ఫలితాలు ఇలా ఉన్నాయి:

మేషం
అశ్విని నక్షత్రం, చంద్రుడి శుభ దృష్టి ప్రభావం ఈ రోజు ఎక్కువగా ఉంది. వృత్తిపరంగా అనుకూలం, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. పురోగతికి మార్గం సుగమం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ సామర్థ్యం ఇతరులు గుర్తిస్తారు. గణపతి ఆరాధన, ఉదయం ఆవులకు ఆహారం పెట్టడం శుభం. లక్కీ కలర్: పసుపు, లక్కీ నంబర్: 9.

వృషభం
శని ప్రభావం ఎక్కువగా ఉంది, పనులలో ఆలస్యం సంభవించవచ్చు. వ్యాపారులు, ఉద్యోగులు తొందరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కొంత ఇబ్బంది. డబ్బు సర్దుబాటులో సమస్యలు రావచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లక్కీ కలర్: తెలుపు, లక్కీ నంబర్: 3.

మిథునం
శని వక్ర దృష్టి ప్రభావం ఎక్కువ. ఉద్యోగులకు కార్యాలయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆడంబరాలకు దూరంగా ఉండండి. రోజు మొదట్లో సాఫీగా ఉన్నా, మధ్యాహ్నం నుండి అనుకూలం కాదు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులకు అనుకూలం కాదు. శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ శుభం. లక్కీ కలర్: నీలం, లక్కీ నంబర్: 6.

కర్కాటకం
శని వక్రగమన ప్రభావం ఎక్కువ. అనవసర ఖర్చులు, హామీలు, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు అనుకూలం. విద్యార్థులు శ్రద్ధగా ఉండాలి. బ్రాహ్మి ముహూర్తంలో దుర్గాదేవికి కుంకుమ పూజ శుభం. లక్కీ కలర్: ఎరుపు, లక్కీ నంబర్: 9.

సింహం
శని ప్రభావం ఉన్నప్పటికీ, ఇతర గ్రహాల వల్ల రోజు అనుకూలంగా ఉంటుంది. వాహన డ్రైవింగ్, విద్యుత్ ఉపకరణాల విషయంలో జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి బాగుంది. వివాదాలు, పెట్టుబడులకు దూరంగా ఉండండి. సుందరకాండ పారాయణం, హనుమంతుడికి ఆకుపూజ శుభం. లక్కీ కలర్: లేత కాషాయం, బంగారు వర్ణం, లక్కీ నంబర్: 5.

కన్య
శని 7వ స్థానంలో ఉన్నా, చంద్ర బలం వల్ల శుభ ఫలితాలు. వ్యాపారులకు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, ఆర్థిక లాభం, మానసిక సంతోషం లభిస్తాయి. ఖర్చుల్లో జాగ్రత్త. విద్యార్థులు శ్రద్ధగా ఉండాలి. రియల్ ఎస్టేట్, ఒప్పందాలకు అనుకూలం. శివారాధన శుభం. లక్కీ కలర్: ఆకుపచ్చ, లక్కీ నంబర్: 9.

తుల
చంద్ర బలం తక్కువ, శని వక్ర దృష్టి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలం. పెట్టుబడులు, అప్పులు, అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. నవగ్రహ ప్రదక్షిణ, తలస్నానం తర్వాత గుడికి వెళ్లడం శుభం. లక్కీ కలర్: తెలుపు, లక్కీ నంబర్: 7.

వృశ్చికం
చంద్ర బలం తక్కువ, కానీ ఇతర గ్రహాల శుభ దృష్టి వల్ల బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి బాగుంటాయి. పనులు పూర్తవుతాయి. ప్రైవేట్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు అనుకూలం. అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. ఆపదమపహర్తారం జపం శుభం. లక్కీ కలర్: ఎరుపు, లక్కీ నంబర్: 9.

ధనుస్సు
చంద్ర బలం, శుక్ర బలం వల్ల రోజు అద్భుతంగా ఉంటుంది. శని ప్రభావం కొంత ఇబ్బంది పెట్టినా, పనులు సాఫీగా పూర్తవుతాయి. ఆర్థిక లాభాలు, వ్యాపారులు, ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. కోర్టు కేసుల్లో విజయం. అమ్మవారి ఆరాధన శుభం. లక్కీ కలర్: ఎరుపు, లక్కీ నంబర్: 7.

మకరం
చంద్ర బలం తక్కువ, కానీ పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగులకు అనుకూలం. డాక్యుమెంట్ సంతకాలకు మంచి రోజు. శివారాధన శుభం. లక్కీ కలర్: నీలం, లక్కీ నంబర్: 6.

కుంభం
అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల రోజు చాలా బాగుంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాల్లో వృద్ధి, రియల్ ఎస్టేట్ ఒప్పందాలకు అనుకూలం. దీర్ఘకాల వివాదం పరిష్కారమవుతుంది. శుభవార్త ఆనందం కలిగిస్తుంది. హనుమంతుడి ఆరాధన శుభం. లక్కీ కలర్: తెలుపు, లక్కీ నంబర్: 6.

మీనం
శని ప్రభావం ఎక్కువ. శత్రువులతో జాగ్రత్త, వెన్నుపోటు సంభవించవచ్చు. ఆచితూచి అడుగులు వేయండి. ఒప్పందాలు, ఆర్థిక విషయాల్లో అనుకూలం కాదు. అప్పులు, హామీలు, స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి. శివారాధన, శివ పంచాక్షరీ జపం శుభం. లక్కీ కలర్: నీలం, లక్కీ నంబర్: 7.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ