Today Horoscope:జూలై 17 గురువారం రాశి ఫలాలు.. ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి..
Today Horoscope:జూలై 17 గురువారం రాశి ఫలాలు.. ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.. నేడు జూలై 17, 2025, గురువారం, ఆషాడ మాసం, సప్తమి తిథి (రాత్రి 7:07 వరకు, తర్వాత అష్టమి), రేవతి నక్షత్రం (తెల్లవారుజాము 3:39 వరకు, తర్వాత అశ్విని). వర్జ్యం సాయంత్రం 4:14 నుండి 5:45 వరకు. శుక్రుడి శుభ దృష్టి వల్ల 6 రాశులకు అనుకోని శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. చాంద్రమానం ప్రకారం ద్వాదశ రాశుల ఈ రోజు ఫలితాలు ఇలా ఉన్నాయి:
మేషం
చంద్రబలం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, గురుబలం వల్ల ఉద్యోగం, వ్యాపార అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామితో చర్చించండి. స్నేహితులు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది, జాగ్రత్త. కుటుంబంలో కలహాలు రాకుండా చూసుకోండి. పనులలో ఆలస్యం సంభవం. అప్పులు ఇవ్వడం, ఎక్కువ వడ్డీ అప్పులు తీసుకోవడం మానండి. నవగ్రహ ప్రదక్షిణ సమస్యలకు పరిష్కారం. లక్కీ నెంబర్: 9, లక్కీ కలర్: నీలం.
వృషభం
గ్రహబలం అనుకూలంగా ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. ధనలాభం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం. అగ్రీమెంట్లు, డాక్యుమెంట్లపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. జూదం ఆడవద్దు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. వీలైతే వేంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించండి. లక్కీ నెంబర్: 5, లక్కీ కలర్: పసుపు.
మిథునం
సంపూర్ణ గ్రహబలం ఉంది. పట్టిందల్లా బంగారం! ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక వ్యక్తి చెడు చేయాలని ప్రయత్నించవచ్చు, మిత్రులతో జాగ్రత్త. హామీలు ఇవ్వకండి. స్పెక్యులేషన్ కలిసిరాదు. శివారాధన చేయండి. లక్కీ నెంబర్: 6, లక్కీ కలర్: తెలుపు.
కర్కాటకం
చంద్రబలం తక్కువగా ఉన్నప్పటికీ, ఇతర గ్రహాల శుభ దృష్టి వల్ల సమయానికి ధనం అందుతుంది. ఆఫీసులో అనవసర వివాదాలు రాకుండా చూసుకోండి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త కలవరం కలిగించవచ్చు. విద్యార్థులకు మంచి రోజు. ఆంజనేయస్వామి ఆకుపూజ చేయించండి. లక్కీ నెంబర్: 9, లక్కీ కలర్: బంగారు వర్ణం.
సింహం
శని ప్రభావం ఎక్కువగా ఉంది. పనులలో ఆలస్యం జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. డబ్బు విషయంలో కొంచెం ఇబ్బంది. లీగల్ వ్యవహారాలకు అనుకూలం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచిదే, కానీ అగ్రీమెంట్లలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు అనుకూలం. అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి. లక్కీ నెంబర్: 6, లక్కీ కలర్: ఎరుపు.
కన్య
గ్రహబలం అనుకూలంగా ఉంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో సానుకూల వాతావరణం. తలపెట్టిన పనుల్లో విజయం. రాజకీయ నాయకులకు, వ్యాపారులకు చాలా మంచి రోజు. అనవసర వివాదాలు రాకుండా చూసుకోండి. చండీ మాతను పూజించండి. లక్కీ నెంబర్: 8, లక్కీ కలర్: నీలం.
తుల
చంద్రుడి, శుక్రుడి శుభ దృష్టి వల్ల అన్ని విధాలా శుభ ఫలితాలు. వివాదాల్లోకి వెళ్ళవద్దు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానండి. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం. లీగల్ వ్యవహారాల్లో విజయం. ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. లక్కీ నెంబర్: 6, లక్కీ కలర్: పసుపు.
వృశ్చికం
గ్రహబలం అనుకూలంగా లేదు. కొత్త పనులకు అస్సలు అనుకూలం కాదు. శుక్రుడి అనుకూలత వల్ల రాజకీయ నాయకులకు మాత్రం మంచి జరిగే అవకాశం. సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. డబ్బు విషయంలో ఇబ్బంది. అగ్రీమెంట్లకు అనుకూలం కాదు. విద్యార్థులకు సామాన్యం. అమ్మవారి దర్శనం మంచి చేస్తుంది. లక్కీ నెంబర్: 7, లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ.
ధనుస్సు
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు. శని అనుకూలత వల్ల ఏ పని చేసినా విజయవంతం. కొత్త వాహనాలు, పెట్టుబడులు చేయవచ్చు. వాగ్వివాదాలు రాకుండా జాగ్రత్త. అప్పులు ఇచ్చే ముందు ఆలోచించండి. మిత్రులతో సమయం వృథా చేయకండి. పనిపై శ్రద్ధ పెట్టండి. లక్కీ నెంబర్: 5, లక్కీ కలర్: తెలుపు.
మకరం
శని వక్ర దృష్టి, చంద్రబలం అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు విజయవంతం. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త వ్యాపార అవకాశాలు. ఉద్యోగులకు చాలా మంచి రోజు. కుటుంబంలో ఉల్లాస వాతావరణం. శివుని దర్శనం మంచి చేస్తుంది. లక్కీ నెంబర్: 6, లక్కీ కలర్: నీలం.
కుంభం
శని వక్ర దృష్టి వల్ల జాగ్రత్త అవసరం. డ్రైవింగ్‌లో జాగ్రత్త. కొత్త పెట్టుబడులు కలిసిరావు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. అందరినీ నమ్మవద్దు. సమయానికి డబ్బు సర్దుబాటవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్కీ నెంబర్: 11, లక్కీ కలర్: నీలం.
మీనం
గ్రహబలం అనుకూలం. తలపెట్టిన పనులు జయప్రదం. ఆడంబరంగా కనిపించే ప్రయత్నం చేయవద్దు. శత్రువులపై నిఘా ఉంచండి. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి రోజు. రాజకీయ నాయకులకు కొత్త అవకాశాలు. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాహుకాలంలో అమ్మవారి దర్శనం చేసుకోండి. లక్కీ నెంబర్: 2, లక్కీ కలర్: పసుపు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

