AP Annadata Sukhibhava: రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు పడతాయి.. కీలక అప్ డేట్..
AP Annadata Sukhibhava: రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు పడతాయి.. కీలక అప్ డేట్.. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు అన్నదాత సుఖీభవ పథకం నిధుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తామని ప్రకటించింది.
అయితే, అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యోజనను సంయుక్తంగా అమలు చేస్తుండటంతో, పీఎం కిసాన్ నిధుల విడుదలలో జాప్యం కారణంగా అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంలో ఆలస్యం జరిగింది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
కేంద్రం నుంచి పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నిధులను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అన్నదాత సుఖీభవ పథకం వివరాలు
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యోజనలను కలిపి అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఏటా రైతుల ఖాతాల్లో రూ. 20,000 జమ చేయనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 6,000, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 14,000.
తొలి విడత: కేంద్రం రూ. 2,000, రాష్ట్రం రూ. 5,000 కలిపి మొత్తం రూ. 7,000.
రెండో విడత: కేంద్రం రూ. 2,000, రాష్ట్రం రూ. 5,000 కలిపి మొత్తం రూ. 7,000.
మూడో విడత: కేంద్రం రూ. 2,000, రాష్ట్రం రూ. 4,000 కలిపి మొత్తం రూ. 6,000.
అన్నదాత సుఖీభవ స్టేటస్ తెలుసుకోవడం ఎలా?
అధికారిక వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ను సందర్శించండి.
“Know Your Status” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.
రైతు పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలతో పాటు పథకం స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
అర్హత, అనర్హత, ఈ-కేవైసీ స్టేటస్ వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.
వాట్సాప్ ద్వారా స్టేటస్ తెలుసుకోవడం
వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ చేయండి.
“సేవను ఎంచుకోండి” ఆప్షన్‌లో అన్నదాత సుఖీభవను సెలక్ట్ చేయండి.
“స్థితిని తనిఖీ చేయండి”పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
“నిర్ధారించండి” క్లిక్ చేస్తే రైతు వివరాలు, అర్హత/అనర్హత, ఈ-కేవైసీ స్టేటస్‌తో సహా సమాచారం అందుబాటులోకి వస్తుంది. అనర్హత కారణం కూడా పేర్కొనబడుతుంది.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

