BusinessToday gold rate

Gold Rate Today: జూలై 18, శుక్రవారం బంగారం ధర.. ఆల్ టైం రికార్డు దిశగా అడుగులు..

Gold Rate Today: జూలై 18, శుక్రవారం బంగారం ధర.. ఆల్ టైం రికార్డు దిశగా అడుగులు.. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

జూలై 18, 2025, శుక్రవారం నాటి ధరల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,570, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,450, మరియు 1 కేజీ వెండి ధర రూ. 1,24,000గా ఉంది. బంగారం ధరలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయిల వైపు దూసుకెళ్తున్నాయని చెప్పవచ్చు.

బంగారం ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే ప్రధాన కారణం. అమెరికాలోని కామెక్స్ మార్కెట్‌లో ఒక ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర ప్రస్తుతం 3346 డాలర్లుగా ఉంది. డాలర్ విలువ పతనం, స్టాక్ మార్కెట్‌లో నెగెటివ్ ట్రెండ్‌లు, మరియు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించే ఇన్వెస్టర్ల ధోరణి వల్ల బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై విధించిన టారిఫ్‌లు కూడా ఈ పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి, ముఖ్యంగా ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం వంటి అంశాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే, వెండి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా వెండి ధరలు పెరిగాయి. పారిశ్రామిక అవసరాల కోసం, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వెండి వినియోగం పెరగడం దీనికి ప్రధాన కారణం. దీంతో వెండికి డిమాండ్ భారీగా పెరిగింది. నిపుణుల అంచనా ప్రకారం, భవిష్యత్తులో కూడా వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ