DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ ఓర్పు చాలా అవసరం..

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ ఓర్పు చాలా అవసరం.. కొంత మంది జాతకాలను ఎక్కువగా నమ్ముతారు. అలాగే కొంత మంది అసలు నమ్మరు.

మేష రాశి
ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ముఖ్య విషయాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. రుణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.

వృషభం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పెద్దల నుంచి మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయం పఠనం శుభకరం.

మిథునం
వృత్తిపరంగా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. సహచరులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కీలక చర్చలు సఫలమవుతాయి. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.

కర్కాటకం
ప్రారంభించే పనుల్లో కొంత శ్రమ ఎక్కువైనప్పటికీ, ఆత్మీయుల సహకారం ఉపయోగపడుతుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శక్తినిస్తుంది.

సింహం
పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర ఆందోళనలకు దూరంగా ఉండండి. నవగ్రహ ధ్యాన శ్లోకం పఠనం మేలు చేస్తుంది.

కన్య
కొత్త పనులను ఉత్సాహంగా ప్రారంభిస్తారు. ఆటంకాలను అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య కార్యక్రమాల్లో బంధుమిత్రులను కలుపుకోవడం మంచిది. ఇష్టదేవతా స్తోత్రం చదవడం శుభప్రదం.

తుల
శుభ భవిష్యత్తు కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యారాధన శుభకరం.

వృశ్చికం
మిశ్రమ పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాలు ఇబ్బంది కలిగించవచ్చు. చంచలమైన నిర్ణయాల వల్ల తప్పులు జరగొచ్చు. గోసేవ చేయడం శుభ ఫలితాలనిస్తుంది.

ధనుస్సు
శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. సహచరుల సహాయం ఒక వ్యవహారంలో ఉపయోగపడుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. ఆదిత్య హృదయం పఠనం మేలు చేస్తుంది.

మకరం
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో సహచరుల సలహాలు తీసుకోవడం మంచిది. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగించవచ్చు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

కుంభం
శుభ సమయం. మనోధైర్యంతో లక్ష్యాలను సాధిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆర్థిక, వస్త్ర లాభాలు కలుగుతాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదవడం మేలు చేస్తుంది.

మీనం
ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్య వ్యవహారంలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠనం శుభకరం.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ