DevotionalToday Rasi Phalalu In telugu

Weekly Horoscope (July 20 -26):ఈ వారం రాశి ఫలాలు.. చిన్న పరిహారాలతో అదృష్టదేవత కృప కలిగే రాశులు..

Weekly Horoscope (July 20 -26):ఈ వారం రాశి ఫలాలు.. చిన్న పరిహారాలతో అదృష్టదేవత కృప కలిగే రాశులు.. జూలై 20 నుండి 26, 2025 వరకు వార రాశిఫలాలు (మేషం నుండి మీనం వరకు):

ఈ వారం బుధుడు మరియు శని వక్రగతి ప్రభావం గణనీయంగా ఉంది. కొన్ని రాశులకు ఈ గ్రహ స్థితులు అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశులకు సవాళ్లు తెచ్చే అవకాశం ఉంది. గోచార ఫలితాల ఆధారంగా మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి ఈ వారం ఎలా ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సూచనలు పాటించాలో తెలుసుకుందాం.

మేషం
ఈ వారం బుధుడు వక్రగతిలో ఉండటంతో శని ప్రభావం కూడా మీపై కనిపిస్తుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొన్ని శుభ ఘట్టాలు జరుగుతాయి. వారం మధ్యలో కొంత గందరగోళం ఉండవచ్చు, మనశ్శాంతి కొంత తగ్గే అవకాశం ఉంది. ధన, వాహన యోగాలు కనిపిస్తాయి. జీవిత భాగస్వామితో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, విలాసవంతమైన జీవనం గడుపుతారు. అయితే, ఖర్చులు నీళ్లలా జరుగుతాయి,

కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సోమవారం, బుధవారం, శనివారాల్లో అప్రమత్తంగా ఉండండి, ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు. విద్యార్థులకు, ఉద్యోగులకు ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. శివారాధన, గణపతికి గరిక పూజ, శనివారం నియమాలు పాటించడం మంచిది.
లక్కీ నెంబర్: 7
లక్కీ కలర్: పసుపు

వృషభం
సోమవారం, శుక్రవారం అనుకూలంగా ఉంటాయి, మిగతా రోజులు సామాన్యంగా ఉంటాయి. ఆర్థికంగా లాభం కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి, స్పెక్యులేషన్లు అనుకూలం కాదు. పెట్టుబడులకు ఈ వారం మంచి సమయం. ఒక వార్త మిమ్మల్ని కలవరపెడుతుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆలోచించి అడుగులు వేయండి. శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించడం మంచిది.
లక్కీ నెంబర్: 6
లక్కీ కలర్: తెలుపు

మిథునం
సోమవారం, బుధవారం, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదివారం వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు. బుధవారం పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆస్తులపై పెట్టుబడులకు ఇది మంచి సమయం. ఇనుము, ఆయిల్ వ్యాపారులకు లాభాలు కనిపిస్తాయి. నిత్యం గణపతి ఆరాధన, హనుమంతుడి పూజ, మంగళవారం ఆకు పూజ చేయించడం శుభప్రదం.
లక్కీ నెంబర్: 5
లక్కీ కలర్: ఎరుపు

కర్కాటకం
ఈ వారం అనుకూలంగా ఉంది. అనుకోకుండా ఆర్థిక లాభం వచ్చే అవకాశం. ఒక మిత్రుడి వల్ల ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్త. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలతో శుభకాలం. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. సృజనాత్మక రంగాల్లో పనిచేసేవారికి అద్భుతమైన సమయం. వ్యాపారులకు లాభదాయకం. జీవిత భాగస్వామితో అనవసర వివాదాలు రాకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులకు మంచి కాలం. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
లక్కీ నెంబర్: 3
లక్కీ కలర్: నీలం

సింహం
వారం శుభకరంగా ప్రారంభమవుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ అవుతాయి, కొత్త ఒప్పందాలకు అనుకూలం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొత్త వెంచర్లకు మంచి సమయం. మానసిక ఒత్తిడి కొంత ఉంటుంది, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గోవులకు ఆహారం పెట్టడం, శివాలయ దర్శనం మంచిది.
లక్కీ నెంబర్: 4
లక్కీ కలర్: గోధుమ రంగు

కన్య
శని, బుధుల వక్రగతి ప్రభావం ఈ వారం ఎక్కువగా ఉంది. కొత్త ఒప్పందాలకు అనుకూలం కాదు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. సోమవారం ధన నష్టం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. మార్కెటింగ్, వడ్డీ వ్యాపారాలకు అనుకూలం. పోలీస్, కోర్టు వ్యవహారాలు కలిసిరావు. నవగ్రహ ప్రదక్షిణ, ఆంజనేయస్వామి దర్శనం మంచి ఫలితాలనిస్తాయి.
లక్కీ నెంబర్: 5
లక్కీ కలర్: నీలం

తుల
శని, బుధుల ప్రభావం తీవ్రంగా ఉంది. వెన్నుపోటు పొడిచే వారితో జాగ్రత్త. ఆర్థిక నష్టాలు రావచ్చు, ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. రియల్ ఎస్టేట్, ఇనుము, సిమెంట్ వ్యాపారులకు లాభదాయకం. కాంట్రాక్టర్లకు అనుకూలం, కానీ మానసిక ఆందోళన ఉంటుంది. బుధవారం, శనివారాల్లో శివాలయ దర్శనం చేయండి, ఆపదలు తగ్గుతాయి.
లక్కీ నెంబర్: 3
లక్కీ కలర్: ఆకుపచ్చ

వృశ్చికం
గ్రహబలం అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో విస్తరణకు అవకాశం. అనుకోకుండా డబ్బు లాభం. ఆరోగ్య సమస్యలు ఉపశమిస్తాయి. రాజకీయ నాయకులకు పదవీ యోగం. మార్కెటింగ్ రంగాలవారికి మంచి కాలం. అత్యుత్సాహంతో చేసే పనులు ఇబ్బందులు తెచ్చే అవకాశం, మంగళవారం జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. హనుమాన్ చాలీసా నిత్యం పఠించండి.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: లేత ఆకుపచ్చ, తెలుపు

ధనుస్సు
అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. పిల్లల కెరీర్ విషయంలో ఆందోళన ఉంటుంది. ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది. శుక్రవారం, శనివారాల్లో ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్త. వ్యాపారులకు మంచి కాలం, ఆరోగ్యం బాగుంటుంది. అకాల భోజనం మానండి. బిల్వపత్రంతో శివపూజ చేయండి.
లక్కీ నెంబర్: 6
లక్కీ కలర్: లేత ఎరుపు

మకరం
శని వక్రగతి ప్రభావం ఉంది. బుధవారం వరకు అనుకూలం కాదు, వారం మధ్య నుండి మంచి ఫలితాలు. అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం. గురువారం పెట్టుబడులకు అనుకూలం. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు, ఉద్యోగులకు మంచి కాలం, ప్రమోషన్ అవకాశాలు. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. శనివారం శివాలయంలో దీపారాధన, గణపతికి గరిక సమర్పణ మంచిది.
లక్కీ నెంబర్: 5
లక్కీ కలర్: ధవళ వర్ణం

కుంభం
శని, బుధుల వక్రగతి ప్రభావం తీవ్రంగా ఉంది. అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు, స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి. బుధవారం ఒక వార్త కలవరం కలిగిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూలలో విజయం కనిపిస్తుంది. వ్యాపారులకు అంత అనుకూలం కాదు. వెంకటేశ్వరస్వామి దర్శనం, విష్ణు సహస్రనామ జపం శుభం.
లక్కీ నెంబర్: 3
లక్కీ కలర్: పసుపు

మీనం
ఈ వారం అనుకూలంగా ఉంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. సోమవారం, మంగళవారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వ్యాపారాల్లో ధనలాభం. బుధవారం, గురువారాల్లో జాగ్రత్త అవసరం. ఆఫీసులో మీపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోండి. శత్రువులతో, సోదరులతో వివాదాలు రాకుండా చూసుకోండి. విద్యార్థులకు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమ పూజ చేయండి.
లక్కీ నెంబర్: 1
లక్కీ కలర్: గోధుమ రంగు

గమనిక: ఈ రాశిఫలాలు గోచార ఫలితాల ఆధారంగా సామాన్య భవిష్యత్తును సూచిస్తాయి. వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాలు మారవచ్చు.