Daily Horoscope:21 జూలై సోమవారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారికీ ధనయోగం..
Daily Horoscope:21 జూలై సోమవారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారికీ ధనయోగం.. నేడు జూలై 21, 2025, సోమవారం, ఆషాఢ మాసం, ఏకాదశి తిథి (ఉదయం 09:39 వరకు), తరువాత ద్వాదశి, రోహిణి నక్షత్రం (రాత్రి 09:39 వరకు), తరువాత మృగశిర. వర్జ్యం: రాత్రి 02:19 నుండి తెల్లవారుజాము 03:48 వరకు. నీడు 6 రాశులపై చంద్రుడి శుభ దృష్టి వల్ల అనుకోని శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. చాంద్రమానం ప్రకారం ద్వాదశ రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి:
మేషం:
చంద్ర బలం తక్కువగా ఉంది. వ్యాపారులు, ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు, వాగ్వివాదాలు తలెత్తే అవకాశం. ఒక వ్యక్తి వల్ల ఇబ్బందులు రావచ్చు. ఒత్తిడికి లోనవొద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శివారాధన శుభం.
లక్కీ కలర్: లేత నీలం
లక్కీ నెంబర్: 7
వృషభం:
చంద్రుడి శుభ దృష్టి ఉంది. శుభవార్తలు, వ్యాపారంలో కొత్త ఆలోచనలు, ఆర్థిక లాభాలు ఉన్నాయి. విందు-వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ అవకాశాలు విజయవంతం. శని వక్రగతి వల్ల శుభం. రియల్ ఎస్టేట్‌లో అగ్రిమెంట్లకు అనుకూలం. విద్యార్థులకు మంచి రోజు. గణపతి ఆరాధన, గరిక సమర్పణ శుభం.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 3
మిథునం:
బుధ, శని, చంద్రుల వ్యతిరేక దృష్టి వల్ల చిక్కులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. ఖర్చులు, ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఉద్యోగులు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సహస్రనామం చదవండి.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 9
కర్కాటకం:
చంద్రుడి శుభ దృష్టి ఉంది. వృత్తి, వ్యాపారంలో విజయం. బుధ వక్ర ప్రభావం వల్ల మధ్యాహ్నం నుండి పనులు నిదానంగా సాగవచ్చు. ఉద్యోగులకు అధికారుల మన్ననలు. హనుమంతుడికి ఆకు పూజ, సింధూర బొట్టు శుభం.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 6
సింహం:
గ్రహబలం తక్కువగా ఉంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వాహన డ్రైవింగ్‌లో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్లకు దూరంగా ఉండండి. విద్యార్థులకు సామాన్యం. దుర్గాదేవికి కుంకుమ పూజ శుభం.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 9
కన్య:
శని ఏడవ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారం నిదానంగా సాగుతుంది. ఖర్చులు, ఆరోగ్యం, ఉద్యోగులకు అధికారులతో ఇబ్బందులు, పిల్లల విషయంలో జాగ్రత్త. వాహన డ్రైవింగ్‌లో అప్రమత్తం. శివాలయ దర్శనం శుభం.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 1
తుల:
శని వక్ర దృష్టి, చంద్ర బలం తక్కువ. పనుల్లో జాప్యం, ఆందోళన. కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం, విద్యార్థులకు అనుకూలం కాదు. శివారాధన ఇబ్బందులు తొలగిస్తుంది.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 5
వృశ్చికం:
గ్రహబలం అనుకూలం. పనులు నెరవేరుతాయి. విందు-వినోదాలు, వ్యాపారంలో ధనలాభం. మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వారికి శుభం. గణపతి ఆరాధన మంచి చేస్తుంది.
లక్కీ కలర్: గులాబీ
లక్కీ నెంబర్: 6
ధనస్సు:
చంద్ర బలం అనుకూలం. వ్యాపారంలో విజయం, కొత్త నిర్ణయాలు. ధనలాభం. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు, విద్యార్థులకు శుభం. సీతారాముల దర్శనం విజయం తెస్తుంది.
లక్కీ కలర్: లేత కాషాయం
లక్కీ నెంబర్: 5
మకరం:
గ్రహబలం అనుకూలం కాదు. కొత్త నిర్ణయాలకు దూరంగా ఉండండి. వ్యాపారులకు ధన నష్టం, శత్రువులతో జాగ్రత్త. మౌనం శ్రేయస్కరం. శివుడికి ఆవు పాలు సమర్పణ ఇబ్బందులు తొలగిస్తుంది.
లక్కీ కలర్: లేత వంకాయ
లక్కీ నెంబర్: 4
కుంభం:
చంద్ర బలం అనుకూలం. పనుల్లో విజయం, సమాజంలో గౌరవం. వ్యాపారులకు ధనలాభం, కొత్త ప్రాజెక్టులకు శుభం. కుటుంబంతో సంతోష సమయం. సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం శుభం.
లక్కీ కలర్: బంగారు వర్ణం
లక్కీ నెంబర్: 5
మీనం:
చంద్ర బలం తక్కువ, శని వక్ర దృష్టి వల్ల పనుల్లో జాప్యం. వ్యాపారులకు, కొత్త నిర్ణయాలకు అనుకూలం కాదు. ఆడంబర ఖర్చులు. ఉద్యోగ మార్పు ప్రయత్నాలకు శుభం. విద్యార్థులకు సామాన్యం.
లక్కీ కలర్: గోధుమ రంగు
లక్కీ నెంబర్: 3
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

