Business

AP Free Bus Scheme:ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలకమైన అప్ డేట్..

AP Free Bus Scheme:ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలకమైన అప్ డేట్.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కానుంది. ఈ పథకంలో భాగంగా మహిళలకు ‘జీరో ఫేర్ టిక్కెట్’ జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ టిక్కెట్‌లో ప్రయాణ వివరాలు, ఉచిత ప్రయాణంతో ఆదా అయిన డబ్బు, ప్రభుత్వం అందించిన 100 శాతం రాయితీ వంటి సమాచారం పొందుపరచాలని సూచించారు.

ఈ జీరో ఫేర్ టిక్కెట్ ద్వారా మహిళలు ఎంత లబ్ది పొందారో సులభంగా తెలుస్తుందని సీఎం తెలిపారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఈ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం వల్ల ఏర్పడిన ఆర్థిక భారం, మన రాష్ట్రంలో అయ్యే వ్యయం వంటి అంశాలపై చర్చించారు. ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆర్టీసీపై భారం పడకుండా, ఇతర ఆదాయ మార్గాలను పెంచడం, నిర్వహణ వ్యయాలను తగ్గించడం ద్వారా సంస్థను లాభాల బాటలో నడిపించాలని సీఎం చంద్రబాబు సూచించారు. లాభాల కోసం అనుసరించాల్సిన మార్గాలు, విధానాలపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అలాగే, ఇకపై ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే కొనుగోలు చేయాలని, ప్రస్తుత బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం ద్వారా నిర్వహణ వ్యయం తగ్గుతుందని సూచించారు. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని, అన్ని ఆర్టీసీ డిపోల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీల అమలుపై దృష్టి సారించారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, తల్లికి వందనం పథకాలను ఇప్పటికే అమలు చేశారు. తాజాగా, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీని ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నారు.

జిల్లా పరిధిలోనే ఉచిత ప్రయాణం
సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై స్పష్టత ఇచ్చారు. ఈ పథకం జిల్లా పరిధిలోనే అమలవుతుందని కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రకటించారు.

11 లక్షల మంది మహిళల ప్రయాణం
రాష్ట్రంలో ఆర్టీసీ టిక్కెట్ల ద్వారా ఏడాదికి రూ.3,708 కోట్ల ఆదాయం వస్తుంది. ఇందులో మహిళల ప్రయాణాల ద్వారా రూ.1,483 కోట్లు వస్తున్నాయి. ఈ పథకం అమలైతే మహిళల ప్రయాణాలు పెరిగి, మొత్తం ఆదాయం రూ.5,051 కోట్లకు చేరుతుందని, అందులో మహిళల వాటా రూ.3,182 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకం వల్ల రోజుకు అదనంగా 11 లక్షల మంది మహిళలు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా. ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం తగిన విధానాలను రూపొందిస్తోంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ