DevotionalToday Rasi Phalalu In telugu

Daily Horoscope:జూలై 22 మంగళవారం రాశి ఫలాలు.. ఖర్చు విషయంలో జాగ్రత్త..

Daily Horoscope:జూలై 22 మంగళవారం రాశి ఫలాలు.. ఖర్చు విషయంలో జాగ్రత్త.. నేడు జూలై 22, 2025, మంగళవారం. చాంద్రమానం ప్రకారం ద్వాదశ రాశులకు ఈ రోజు ఎలా ఉంటుందో దినఫలాల ద్వారా తెలుసుకుందాం:

మేషం:
ఈ రాశివారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడుస్తుంది. ఆర్థికంగా శుభవార్తలు. వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. గణపతికి గరిక సమర్పిస్తే విఘ్నాలు తొలగుతాయి.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 6

వృషభం:
చంద్రుడి ప్రభావం అనుకూలంగా ఉంది. శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగులకు అధికారుల మన్ననలు. వ్యాపారులకు పనులు నిదానంగా సాగవచ్చు. రియల్ ఎస్టేట్‌లో ఒప్పందాలకు శుభకాలం. వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభం.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 9

మిథునం:
నవగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రతి పనిలో విజయం. విందు వినోదాల్లో ఆనందిస్తారు. కుటుంబంలో సౌహార్దం పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్త.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 1

కర్కాటకం:
శని వక్రదృష్టి కారణంగా జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో అప్రమత్తత వహించండి. కొత్త ఒప్పందాలకు అనుకూలం కాదు. వాగ్వివాదాలు నివారించండి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. ఆంజనేయస్వామి ఆరాధన శుభం.
లక్కీ కలర్: లేత కాషాయం
లక్కీ నెంబర్: 5

సింహం:
బుధ, శని గ్రహాలు అనుకూలం. మనోవాంఛ సిద్ధిస్తుంది. వ్యాపారులకు లాభం, విద్యార్థులకు శుభకాలం. బంధుమిత్రుల సహకారం. పెండింగ్ పనులు పూర్తవుతాయి. శివాలయంలో ఆవుపాల సమర్పణ శుభం.
లక్కీ కలర్: లేత నీలం
లక్కీ నెంబర్: 9

కన్య:
శుక్ర, కుజ గ్రహాల ప్రభావంతో పనులు విజయవంతం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి. విద్యార్థులు, ఉద్యోగులకు అనుకూలం. హనుమంతుడి దర్శనం శుభం.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 6

తుల:
చంద్రుడి అనుకూలతతో శుభఫలితాలు. వ్యక్తిగత పరపతి పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు, ప్రమోషన్ అవకాశం. వ్యాపారులకు అద్భుత రోజు. గణపతి ఆరాధన శుభం.
లక్కీ కలర్: గోధుమ వర్ణం
లక్కీ నెంబర్: 1

వృశ్చికం:
గ్రహబలం అనుకూలం. వాస్తు, వాహన యోగం. బంగారు ఆభరణాల కొనుగోలుకు అవకాశం. ఇంటి కోసం ప్రయత్నాలు శుభం. వ్యాపారులకు లాభం, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. వాగ్వివాదాలు నివారించండి. గణపతి దర్శనం శుభం.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 3

ధనస్సు:
శని ప్రభావం కారణంగా జాగ్రత్త అవసరం. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు సామాన్య ఫలితాలు. శివాలయ దర్శనం శుభం.
లక్కీ కలర్: ముదురు నీలం
లక్కీ నెంబర్: 3

మకరం:
గ్రహబలం అనుకూలం. వ్యాపార నిర్ణయాలు లాభిస్తాయి. కుటుంబంతో విందు వినోదాలు. శుభవార్త ఆనందం కలిగిస్తుంది. అమ్మవారి దర్శనం శుభఫలితాలు ఇస్తుంది.
లక్కీ కలర్: ధవళ వర్ణం
లక్కీ నెంబర్: 1

కుంభం:
శని వక్రదృష్టి తీవ్రంగా ఉంది, జాగ్రత్త అవసరం. శుక్రుడి అనుగ్రహంతో కొన్ని పనులు విజయవంతం. ఆర్థికంగా బాగున్నా, నిర్ణయాల్లో జాగ్రత్త. వాగ్వివాదాలు నివారించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పై శ్రద్ధ. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభం.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 6

మీనం:
గ్రహబలం అద్భుతం. ఉద్యోగులకు, వ్యాపారులకు లాభదాయక రోజు. ప్రతి పనిలో విజయం. కాంట్రాక్టర్లకు బిల్లులు, ఆస్థి వివాదాల్లో పరిష్కారం. పెద్దల సేవ, దుర్గాదేవి ఆరాధన శుభం.
లక్కీ కలర్: గులాబీ
లక్కీ నెంబర్: 11