Hair Growth Tips:నేచురల్ హెయిర్ జెల్ వాడితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది..
Hair Growth Tips:నేచురల్ హెయిర్ జెల్ వాడితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.. జుట్టు పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి నిరాశ చెందిన వారు చాలామంది ఉన్నారు. కానీ, ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కా మాత్రం ఖచ్చితంగా పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈ చిట్కాకు ఉపయోగించే పదార్థాలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.
అవి ఏమిటంటే? చియా గింజలు మరియు గంజి. ఈ చిట్కాను అనుసరించడానికి, ముందుగా అరకప్పు బియ్యం నానబెట్టిన నీరు లేదా గంజిలో 1-2 టేబుల్ స్పూన్ల చియా గింజలు, 2 కప్పుల నీళ్లు వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమం జెల్ లాంటి స్థిరత్వానికి వచ్చే వరకు ఉడికించాలి.
తర్వాత, దీనిని దించి చల్లారిన తరువాత కొన్ని చుక్కల రోజ్మేరీ లేదా లావెండర్ ఆయిల్ కలిపి, వడకట్టాలి. ఈ ద్రవాన్ని గాజు సీసా లేదా బాటిల్లో నింపి, కనీసం వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ఆ తర్వాత, ఈ జెల్‌ను తీసుకుని జుట్టు పలచబడిన లేదా రాలిన ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి.
ఇలా చేయడం వల్ల స్కాల్ప్‌లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ జెల్‌ను కనీసం అరగంట పాటు అలాగే ఉంచి, తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడిగేయాలి. వారానికి 2-3 సార్లు ఈ విధంగా చేస్తే, జుట్టు రాలడం తగ్గడమే కాకుండా, బట్టతల సమస్యపై కూడా కొత్త వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

