DevotionalToday Rasi Phalalu In telugu

Daily Horoscope:జూలై 25 శుక్రవారం రాశి ఫలాలు.. ఈ 8 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

Daily Horoscope:జూలై 25 శుక్రవారం రాశి ఫలాలు.. ఈ 8 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి… నేడు జూలై 25, 2025, శుక్రవారం. చాంద్రమానం ప్రకారం, శ్రావణమాసం, పాడ్యమి తిథి (రాత్రి 11:26 వరకు, తరువాత విదియ), పుష్యమి నక్షత్రం (సాయంత్రం 4:02 వరకు, తరువాత ఆశ్లేష). వర్జ్యం ఉదయం 4:43 నుండి 6:18 వరకు. కుజ, గురు గ్రహాల శుభ దృష్టి వల్ల 5 రాశులకు అనుకోని శుభ ఫలితాలు సంభవించే అవకాశం ఉంది. ద్వాదశ రాశుల ఈ రోజు దినఫలాలు ఇలా ఉన్నాయి:

మేషం
వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. విహార యాత్రకు సన్నాహాలు చేస్తారు. సంతానం విజయాలు సాధిస్తుంది. ఇష్టదేవతా ఆరాధన శుభ ఫలితాలను తెస్తుంది.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 1

వృషభం
వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఒక వార్త ఆందోళన కలిగించవచ్చు. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. దేవాలయ దర్శనం శుభం.
లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ
లక్కీ నెంబర్: 9

మిథునం
వృత్తి, వ్యాపారంలో అనుకూల సమయం. ఎదురుచూస్తున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగులకు శుభవార్తలు. మాటల్లో మృదుత్వం పాటించడం ముఖ్యం. రాహుకాల దీపం మనోవాంఛలను నెరవేరుస్తుంది.
లక్కీ కలర్: బంగారు వర్ణం
లక్కీ నెంబర్: 6

కర్కాటకం
వ్యాపారంలో విజయం సాధిస్తారు. తోబుట్టువుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆఫీసులో వాదనలకు దూరంగా ఉండండి. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం శుభం.
లక్కీ కలర్: వంకాయ రంగు (వైలెట్)
లక్కీ నెంబర్: 3

సింహం
వృత్తిలో అద్భుతంగా రాణిస్తారు. పాత పరిచయాల వల్ల లాభం. తలపెట్టిన పనులు విజయవంతం. ఆకస్మిక ధనలాభం కోసం దుర్గాదేవి స్తుతి మంచిది.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 1

కన్య
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో లాభం. చేసిన పనుల్లో విజయం. పెండింగ్ పనులు పూర్తవుతాయి. విదేశీ వ్యాపారులకు లాభావకాశం. శివారాధన శుభం.
లక్కీ కలర్: గోధుమ వర్ణం
లక్కీ నెంబర్: 1

తుల
ఆఫీసులో ప్రమోషన్ అవకాశం. శుభవార్తలు వింటారు. కుటుంబంలో గొడవలు రాకుండా మాటల్లో జాగ్రత్త అవసరం. విదేశీ ఉద్యోగులకు సవాళ్లు. గణపతి ఆరాధన శుభం.
లక్కీ కలర్: ఆకుపచ్చ
లక్కీ నెంబర్: 8

వృశ్చికం
కొత్త వస్తువుల కొనుగోలుకు అనుకూల సమయం. ఆఫీసులో ప్రశంసలు. లోన్ అనుమతి లభించే అవకాశం. బంధువులతో ఆనందం. వ్యాపారంలో అప్రమత్తత అవసరం. హనుమాన్ ఆరాధన శుభం.
లక్కీ కలర్: లేత గులాబీ
లక్కీ నెంబర్: 9

ధనస్సు
వ్యాపారంలో ఆటంకాలు, నమ్మినవారి నుండి మోసం రావచ్చు. ఖర్చులను నియంత్రించండి. సంతాన సమస్యలపై దృష్టి పెట్టండి. శివారాధన, శివాలయ దర్శనం మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 5

మకరం
వ్యాపారంలో నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయి. కుటుంబంతో ఆనందం. బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొనే అవకాశం. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు. లక్ష్మీదేవి ఆరాధన అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 2

కుంభం
వ్యాపార విషయంలో విదేశీ ప్రయాణ అవకాశం. బంధువుల నుండి శుభవార్త. ఉద్యోగంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం. విష్ణుమూర్తి ఆరాధన శుభం.
లక్కీ కలర్: ఊదా
లక్కీ నెంబర్: 3

మీనం
ఆరోగ్యం, ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. స్టాక్ మార్కెట్‌లో మంచి పెట్టుబడులు. కుటుంబంతో ఆనందం. మాట తీరుతో సమాజంలో మంచి పేరు. దూర ప్రయాణాల్లో జాగ్రత్త. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన శుభం.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 7

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు