Business

Thailand:థాయ్‌లాండ్‌కు వెళ్లే భారతీయులకు ముఖ్య హెచ్చరిక…

Thailand:థాయ్‌లాండ్‌కు వెళ్లే భారతీయులకు ముఖ్య హెచ్చరిక… ఏడు ప్రాంతాలకు ప్రయాణించవద్దని భారత రాయబార కార్యాలయం సూచన.. భారత్ నుంచి ఎంతో మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌కు విహార యాత్రలకు వెళ్తుంటారు. అయితే, ప్రస్తుతం థాయ్‌లాండ్-కంబోడియా మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…

థాయ్‌లాండ్‌-కంబోడియా సరిహద్దుల్లో జరుగుతున్న ఘర్షణల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో థాయ్‌లాండ్‌కు వెళ్లే భారతీయ పర్యాటకులు కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. మొత్తం ఏడు ప్రాంతాలకు ప్రయాణం చేయవద్దని సూచించింది.

థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, థాయ్‌లాండ్‌కు వెళ్లే భారతీయ ప్రయాణికులు TAT న్యూస్‌రూమ్ వంటి అధికారిక మూలాల నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలని రాయబార కార్యాలయం సలహా ఇచ్చింది. ఈ మేరకు థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. థాయ్‌లాండ్ టూరిజం అథారిటీ కూడా రాట్చథాని, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కేయో, చంతబురి, ట్రాట్ ప్రావిన్సులలోని ప్రముఖ ప్రదేశాలకు పర్యాటకులు వెళ్లొద్దని హెచ్చరించిన పోస్ట్‌ను రాయబార కార్యాలయం షేర్ చేసింది.

థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దులో జరిగిన ఘర్షణల్లో కనీసం 11 మంది మరణించినట్లు, పలువురు గాయపడినట్లు థాయ్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ తెలిపింది. గురువారం ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణల్లో ఈ మరణాలు సంభవించాయి. థాయ్‌లాండ్-కంబోడియా మధ్య సరిహద్దు వివాదం చాలా కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ