DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో..

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో.. మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు. కొంత మంది అసలు నమ్మరు.
మేషం
వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. ప్రారంభించిన పనులలో అడ్డంకులు ఎదురైనా, వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. కొన్ని సందర్భాల్లో అస్థిరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. నవగ్రహ శ్లోకం పఠించడం మంచిది.

వృషభం
పట్టుదలతో కృషిచేసి లక్ష్యాలను సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచనలో ఉన్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసిక శాంతిని కాపాడుకోవాలి. దుర్గా అష్టోత్తరం పఠిస్తే శుభం.

మిథునం
సుఖ సౌఖ్యాలు అందుతాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన విషయంపై పెద్దలను సంప్రదిస్తారు, ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభం శుభప్రదం. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం
మానసిక శాంతిని కాపాడుకోవాలి. కొత్త పనుల్లో శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక నియంత్రణ అవసరం. విష్ణు సహస్రనామం పఠిస్తే మేలు జరుగుతుంది.

సింహం
పట్టుదలతో అడ్డంకులను అధిగమించి పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాల నుంచి దూరంగా ఉండడం మంచిది. ఆదిత్య హృదయం పఠించాలి.

కన్య
మీ రంగంలో పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధన వృద్ధి, సన్మానం, సుఖం, విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలవంతం. గణపతి ఆరాధన శుభం.

తుల
స్థిర నిర్ణయాలు సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అడ్డంకులు రాకుండా జాగ్రత్తపడాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు తప్పవు. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం
భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు అందుతాయి. గోవింద నామాలు పఠిస్తే శుభం.

ధనుస్సు
ఆశించిన ఫలితాల కోసం ఎక్కువగా శ్రమించాలి. క్షమాగుణంతో సంబంధాలు బలపడతాయి. ముఖ్య వ్యవహారాలలో పురోగతి కోసం కష్టపడాలి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.

మకరం
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రుల సహాయంతో పనులు త్వరగా పూర్తవుతాయి. నిద్ర, ఆహారంపై శ్రద్ధ అవసరం. ముఖ్య వ్యవహారాలలో తొందరపాటు సరికాదు. శ్రీదుర్గ ఆరాధన శుభకరం.

కుంభం
మనఃసౌఖ్యం ఉంటుంది. మీ రంగంలో మంచి పేరు సంపాదిస్తారు. శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థాన మార్పు సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. శివ ఆరాధన శుభప్రదం.

మీనం
కొత్త పనుల్లో మనోధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగంలో అడ్డంకులు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. పై అధికారులతో సఖ్యతగా ఉండాలి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. దుర్గాధ్యానం శుభం.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ