PM Kisan Yojana: ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్…. ఏపీ రైతులకు డబుల్ బోనస్.. ఎలానో చూడండి..
PM Kisan Yojana: ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్…. ఏపీ రైతులకు డబుల్ బోనస్.. ఎలానో చూడండి.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ యోజన డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఏడాది 20వ విడత డబ్బులు ఇంకా విడుదల కాలేదు. జూలై 18 నాటికి ఈ నిధులు విడుదలవుతాయని భావించినప్పటికీ, అధికారిక ప్రకటన లేకపోవడంతో కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమవుతాయి? ఆంధ్రప్రదేశ్ (ఏపీ) రైతులకు ఈ పథకం రెండు విధాలుగా ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాల్లో క్రమం తప్పకుండా నిధులు జమ చేస్తోంది. ఇప్పటివరకు 19 విడతలలో రూ.2000 చొప్పున డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా ఏటా రూ.6000 రైతులకు అందుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటి విడతగా రూ.2000 జమ అయ్యాయి.
రెండో విడతగా జూలైలో మరో రూ.2000 జమవుతాయని అందరూ ఊహించారు, కానీ ఇంకా జమ కాలేదు. తాజా సమాచారం ప్రకారం, ఆగస్టు 15 నాటికి లేదా అంతకుముందే ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. ఈ పథకం కింద రూ.6000 నేరుగా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ (DBT) పద్ధతిలో రైతుల ఖాతాల్లో జమవుతాయి.
పీఎం కిసాన్ యోజన రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించబడింది. ఈ పథకం ద్వారా, ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు గణనీయమైన ప్రయోజనం లభిస్తుంది. ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాలంటే, ముందుగా పీఎం కిసాన్ యోజనలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా మీసేవ కేంద్రంలో అవసరమైన డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
ఇదిలా ఉంటే, ఈ పథకం ఏపీ రైతులకు రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.14,000 జమ చేసింది. ఇప్పుడు పీఎం కిసాన్ యోజన కింద రూ.6000 జమ అయితే, రైతులకు మొత్తం రూ.20,000 ప్రయోజనం లభిస్తుంది. ఈ విధంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి రెండు రకాలుగా ఆర్థిక సహాయం అందుతుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

