BusinessToday gold rate

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. దాదాపుగా 5000 తగ్గిన ధర..

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. దాదాపుగా 5000 తగ్గిన ధర.. నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధర గణనీయంగా తగ్గింది. జూలై 30, బుధవారం నాడు బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,570, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,600, మరియు ఒక కిలో వెండి ధర రూ. 1,26,000గా నమోదైంది.

గత కొంతకాలంగా బంగారం ధరలు కొత్త రికార్డులను నమోదు చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ, ప్రస్తుతం బంగారం ధర ఆల్-టైం గరిష్ట స్థాయికి సమీపంలో ఉన్నప్పటికీ, రూ. 1,00,000 కంటే తక్కువకు పడిపోయింది.

బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా డాలర్ విలువ పెరగడాన్ని చెప్పవచ్చు. అంతేకాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర ఒక ఔన్స్‌కు $3,450 నుంచి $3,320కి పడిపోయింది. దీని ప్రభావంతో రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ