DevotionalToday Rasi Phalalu In telugu

Daily Horoscope:జూలై 31 గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారికీ ఆర్ధికంగా కలిసి వస్తుంది..

Daily Horoscope:జూలై 31 గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారికీ ఆర్ధికంగా కలిసి వస్తుంది.. నేడు జూలై 31, 2025, గురువారం, శ్రావణమాసం, సప్తమి తిథి (తెల్లవారుజామున 04:58 వరకు), తరువాత అష్టమి, చిత్తా నక్షత్రం (రాత్రి 12:36 వరకు), ఆ తర్వాత స్వాతి. వర్జ్యం: ఉదయం 06:49 నుండి 08:36 వరకు. ఈ రోజు రాశుల వారీగా జాతక ఫలితాలు ఇలా ఉన్నాయి:

మేషం: ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగులకు సాధారణ ఫలితాలు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. హనుమంతుని దర్శించి, ఆపదమపహర్తారం స్తోత్రం చదివి రోజును ప్రారంభిస్తే మంచి జరుగుతుంది.

వృషభం: ఈ రాశి వారికి గ్రహబలం పూర్తిగా అనుకూలంగా లేదు. మానసిక ఆందోళన, కుటుంబంలో విభేదాలు రావచ్చు. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అనవసర వాదనలు లేకుండా జాగ్రత్త వహించండి. గణపతి ఆరాధన చేయడం వల్ల సమస్యలు తొలగుతాయి.

మిథునం: వ్యాపారంలో జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక రిస్క్‌లు తీసుకోవద్దు. కుటుంబంలో విభేదాలు రావచ్చు. అప్పులు ఇవ్వడం, హామీలు ఇవ్వడం మానండి. శివారాధన శుభ ఫలితాలను ఇస్తుంది.

కర్కాటకం: వృత్తి, వ్యాపారాల్లో ధనలాభం ఉంటుంది. ఖర్చులను నియంత్రించండి. కుటుంబంలో ఆస్తి విషయంలో తగాదాలు రావచ్చు. ఎవరిపైనా అతిగా నమ్మకం ఉంచవద్దు. విద్యార్థులకు, ఉద్యోగులకు సామాన్య ఫలితాలు. దత్తాత్రేయ ఆరాధన శుభం.

సింహం: బుధుడి శుభ ప్రభావంతో వ్యాపారంలో లాభాలు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆఫీసులో సహకారం, ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. పాత స్నేహితుడిని కలిసే అవకాశం. శివాలయ దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది.

కన్య: శని వక్ర దృష్టి వల్ల వ్యాపారంలో నష్టం రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సర్దుబాటు సమస్యలు రావచ్చు. ఉద్యోగులకు మంచి ఫలితాలు. కుటుంబం నుండి మద్దతు, శుభ కార్యాలు జరుగుతాయి. గణపతికి గరిక పూజ శుభం.

తుల: శని, బుధుల వక్ర దృష్టితో వ్యాపారం నీరసంగా సాగుతుంది. అనవసర ఖర్చులు నియంత్రించండి. భాగస్వాముల వల్ల నష్టాలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. నవగ్రహ ప్రదక్షిణ, శివుడికి ఆవుపాల సమర్పణ మంచి ఫలితాలను ఇస్తుంది.

వృశ్చికం: శుక్రుడి శుభ దృష్టితో వ్యాపారం అద్భుతంగా సాగుతుంది. చంద్ర బలం తక్కువగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి రావచ్చు. దూర ప్రయాణాలు, కొత్త ఒప్పందాలు అనుకూలం. రియల్ ఎస్టేట్‌కు మంచి రోజు. వివాదాలు జోలికి వెళ్ళవద్దు. పంచముఖి ఆంజనేయునికి కొబ్బరికాయ సమర్పణతో సమస్యలు తొలగుతాయి.

ధనస్సు: గురు, బుధ గ్రహాల శుభ దృష్టితో మానసిక సంతోషం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలు. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. వ్యాపారులకు ధనలాభం. నవగ్రహ ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.

మకరం: వ్యాపారంలో శుభ ఫలితాలు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. దూర ప్రయాణాలు, విద్యార్థులకు చదువులో శ్రద్ధ. లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం శుభం.

కుంభం: బుధుడి వక్ర దృష్టి ఉన్నప్పటికీ, శని బలం కొంత అనుకూలంగా ఉండటంతో వ్యాపారంలో లాభాలు. కుటుంబంలో తోబుట్టువులతో విభేదాలు రావచ్చు. అనవసర వాదనలు మానండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పణ శుభం.

మీనం: వృత్తి, వ్యాపారంలో అద్భుత ఫలితాలు. శని వక్ర దృష్టి వల్ల వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. కుటుంబంలో శుభ కార్యాలు. అనవసర వివాదాలు మానండి, మాటలు అదుపులో ఉంచుకోండి. విష్ణు సహస్రనామ జపం సమస్యలను తొలగిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ