Today Horoscope:ఆగస్ట్ 3 రాశి ఫలాలు.. ఖర్చు విషయంలో జాగ్రత్త..
Today Horoscope:ఆగస్ట్ 3 రాశి ఫలాలు.. ఖర్చు విషయంలో జాగ్రత్త.. జాతకాలను కొంత మంది నమ్ముతారు. కొంత మంది అసలు నమ్మరు. ఈ ఆర్టికల్ జాతకాలను నమ్మే వారి కోసం మాత్రమే..
మేషం
ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థికంగా అనుకూల కాలం. ఇష్టదైవ స్తుతి శ్రేష్ఠ ఫలితాలను అందిస్తుంది.
వృషభం
శుభకరమైన సమయం. అన్ని విధాలా సహకారం లభిస్తుంది. గౌరవం, సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు. మిత్రుల సహాయం ఉంటుంది. లక్ష్మీస్తుతి మేలు చేస్తుంది.
మిథునం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో సంతృప్తికర ఫలితాలు. పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయడం శుభప్రదం.
కర్కాటకం
శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సమావేశమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగించవచ్చు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పఠనం మంచిది.
సింహం
మధ్యమ ఫలితాలు. శ్రమతో కూడిన ఫలితాలు సిద్ధిస్తాయి. గిట్టనివారి సలహాలు తప్పుదారి పట్టించవచ్చు. చిన్న విషయాలను పెద్దవిగా చేయవద్దు. దుర్గారాధన శుభం.
కన్య
అనుకూల కాలం. ఆలోచించిన పనులు సఫలమవుతాయి. ముఖ్య విషయాల్లో పురోగతి. సమన్వయంతో ముందుకు సాగితే లక్ష్యాలు త్వరగా చేరుకుంటారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
తుల
శ్రేష్ఠమైన సమయం. ప్రారంభించిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫలితం అందుతుంది. సందడిగా వాతావరణం ఉంటుంది. ఇష్టదైవ దర్శనం మేలు.
వృశ్చికం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల నిర్ణయాలు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. సానుకూలంగా వ్యవహరిస్తే మంచిది. శని ధ్యానం శుభప్రదం.
ధనుస్సు
పనులలో అడ్డంకులు ఎదురైనా, పట్టుదలతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలకు ముందు బాగా ఆలోచించండి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేయవచ్చు. అర్హతకు తగిన ఫలితాలు. శ్రీ వేంకటేశ్వర దర్శనం ఉత్తమం.
మకరం
కష్టపడితే లక్ష్యాలు నెరవేరతాయి. వృథా ప్రయాణాలు ఉండవచ్చు. ఒక వార్త బాధ కలిగించవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎక్కువ శ్రమ అవసరం. బంధువుల సహాయం ఉంటుంది. హనుమత్ ఆరాధన మంచిది.
కుంభం
మీ రంగంలో అనుకూల వాతావరణం. ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త. ప్రతిభకు ప్రశంసలు. వ్యాపార లావాదేవీలు సానుకూలం. ఇష్టదైవ ఆరాధన శుభం.
మీనం
మనోబలం కాపాడుకోండి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన బాధ కలిగించవచ్చు. అధికారులతో అప్రమత్తంగా ఉండండి. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

