Daily Horoscope:నేడు ఆగష్టు 04 సోమవారం రాశిఫలాలు.. ఈ రాశుల వారికీ కోరికలు తీరే అవకాశం..
Daily Horoscope:నేడు ఆగష్టు 04 సోమవారం రాశిఫలాలు.. ఈ రాశుల వారికీ కోరికలు తీరే అవకాశం.. నేడు ఆగష్టు 04, సోమవారం, శ్రావణమాసం, తిథి దశమి ఉదయం 11:39 వరకు, తరువాత ఏకాదశి. అనురాధ నక్షత్రం ఉదయం 09:04 వరకు, తరువాత జ్యేష్ఠ. వర్జ్యం మధ్యాహ్నం 03:18 నుండి సాయంత్రం 05:03 వరకు. ఈ రోజు రాశుల వారీ జాతక ఫలితాలు ఇలా ఉన్నాయి…
మేషం:
ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనులు సఫలమవుతాయి. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ఊహించని ధనలాభం సాధ్యం. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలకు అనుకూల సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూ క్రయవిక్రయాలు లాభదాయకం. గణపతికి గరిక పూజ చేయడం శుభఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 1
వృషభం:
గ్రహస్థితి పాక్షికంగా ఉంది. వ్యాపారులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. ఆస్తులపై పెట్టుబడులు లాభిస్తాయి. భూమి కొనుగోలుకు అనుకూలం. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. బ్రహ్మముహూర్తంలో గణపతి ఆరాధన చేయడం శుభం.
లక్కీ కలర్:: ముదురు ఆకుపచ్చ
లక్కీ నెంబర్: 6
మిథునం:
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అద్భుతమైన సమయం. ఏ పని చేసినా సఫలమవుతుంది. ధనలాభం సూచితం. కుటుంబంలో సంతోషం ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శివాలయ దర్శనం శుభఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: బంగారు వర్ణం
లక్కీ నెంబర్: 6
కర్కాటకం:
గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ, శని ప్రభావం వల్ల పనులు ఆలస్యమవుతాయి. అకాల భోజనం, శ్రమాధిక్యత కనిపిస్తాయి. ధనలాభ సూచన ఉంది. ఒక నిర్ణయంపై పునరాలోచన చేస్తారు. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదైవ ఆరాధన శుభం.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 3
సింహం:
గ్రహస్థితి అనుకూలం, కానీ శని ప్రభావం ఎక్కువగా ఉంది. తలపెట్టిన పనులు సఫలమవుతాయి. ధన సమస్యలు సర్దుబాటవుతాయి. అనవసర వాగ్వివాదాల నుఊండి దూరంగా ఉండండి. ఉద్యోగులు పనిప్రదేశంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అమ్మవారి దర్శనం శుభఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 9
కన్య:
గ్రహస్థితి పాక్షికం. ఉద్యోగులు పనిప్రదేశంలో జాగ్రత్తగా ఉండాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. పనిని దైవంగా భావించండి. అధికారుల మెప్పు కోసం ప్రయత్నించండి. వాహనాలు, బంగారం కొనుగోలుకు అవకాశం. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. దత్తాత్రేయ ఆలయ దర్శనం శుభం.
లక్కీ కలర్: గంధం రంగు
లక్కీ నెంబర్: 1
తుల:
గ్రహస్థితి అనుకూలం. ఆర్థిక లాభాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు మంచి సమయం. ఉద్యోగులు అధికారుల మెప్పు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాలు కలిసివస్తాయి. మిత్రులలో జాగ్రత్త అవసరం. లక్ష్మీ నరసింహ ఆరాధన శుభం.
లక్కీ కలర్: ఆకుపచ్చ
లక్కీ నెంబర్: 6
వృశ్చికం:
గ్రహస్థితి పాక్షికం. శుక్రుడి అనుగ్రహంతో మీ మాటకు విలువ పెరుగుతుంది. ధనలాభం ఉంది, కానీ ఖర్చులు అధికం. పెట్టుబడులకు అనుకూలం, కానీ స్పెక్యులేషన్, డే ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి. జూదం నుండి దూరం. వ్యాపారులకు శుభ సమయం. వేంకటేశ్వరస్వామికి తులసి మాల సమర్పణ శుభం.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 9
ధనస్సు:
గ్రహస్థితి పాక్షికం. ఉపాధ్యాయులకు, వృత్తి నిపుణులకు అనుకూలం. ప్రైవేట్ ఉద్యోగులకు పని ఒత్తిడి. వ్యాపారులకు ధనలాభం. పన్ను వ్యవహారాల్లో జాగ్రత్త. రియల్ ఎస్టేట్‌కు లాభదాయకం. మహాలక్ష్మి ఆరాధన శుభం.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 5
మకరం:
శని ప్రభావం ఎక్కువగా ఉంది. పనులలో అడ్డంకులు రావచ్చు. సోదరులతో ఆస్తి విషయంలో వివాదాలు సాధ్యం. ఆరోగ్యం, వాహన డ్రైవింగ్‌లో జాగ్రత్త. వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. అప్పులు ఇవ్వొద్దు. శివుడికి తేనె, పాలు సమర్పణ ఇబ్బందులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: నలుపు
లక్కీ నెంబర్: 2
కుంభం:
శని దృష్టి వల్ల పనులు ఆలస్యమవుతాయి. మోకాళ్ల సమస్యలు రావచ్చు. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ధన విషయంలో ఇబ్బంది సాధ్యం. హామీలు ఇవ్వొద్దు. మిత్రులతో, ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. నవగ్రహ ప్రదక్షిణ, శివ అభిషేకం శుభం.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 3
మీనం:
గ్రహస్థితి పాక్షికం. ఊహించని ధనలాభం సాధ్యం. ఖర్చులపై నియంత్రణ అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టాలు సాధ్యం. భూమి, గృహ కొనుగోలుకు మంచి సమయం. దత్తాత్రేయ ఆలయ దర్శనం, పంచముఖి ఆంజనేయుడికి కొబ్బరికాయ సమర్పణ శుభం.
లక్కీ కలర్: కాషాయం
లక్కీ నెంబర్: 7
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

