Beauty Tips

Bald head problem:బట్ట తల బాధిస్తోందా? – ఈ దుంపతో జుట్టు పెరుగుతుందంటున్న డాక్టర్లు..

Bald head problem:బట్ట తల బాధిస్తోందా? – ఈ దుంపతో జుట్టు పెరుగుతుందంటున్న డాక్టర్లు.. ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, నీటి మరియు వాయు కాలుష్యం, హెల్మెట్ ధరించడం వంటి కారణాల వల్ల బట్టతల సమస్య బాగా పెరిగిపోతోంది. గతంలో 50 ఏళ్లు దాటిన వారిలోనే ఈ సమస్య కనిపించేది, కానీ ఇప్పుడు 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు.

దీని వల్ల చాలామంది వివిధ రకాల ట్రీట్మెంట్లను ప్రయత్నిస్తున్నారు. అయితే, మీ ఇంట్లో సులభంగా దొరికే బీట్‌రూట్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని తెలుసా? బీట్‌రూట్‌తో తయారు చేసిన హెయిర్ ప్యాక్ వాడితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
బీట్‌రూట్ రసం – అర కప్పు
అల్లం రసం – 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:
ఒక పాత్ర తీసుకుని, అందులో అర కప్పు బీట్‌రూట్ రసం పోయాలి. ఆ తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం రసం కలపాలి. ఆపై 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె వేసి, అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమంతో బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ సిద్ధమవుతుంది.

అప్లికేషన్ విధానం:
ఈ హెయిర్ ప్యాక్‌ను జుట్టు మరియు తలపై కొద్దిగా పట్టించి, నెమ్మదిగా మసాజ్ చేయాలి. 20 నిమిషాల పాటు ఇలా మసాజ్ చేసిన తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే, బట్టతల సమస్య తగ్గుతుంది. జుట్టు రాలడం ఆగిపోయి, వెంట్రుకలు ఆరోగ్యంగా, బలంగా మారుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ