Weekly Horoscope in Telugu:ఈ రాశి వారికీ అనుకోని లాభం.. మీ రాశి ఉందా..?
Weekly Horoscope in Telugu:ఈ రాశి వారికీ అనుకోని లాభం.. మీ రాశి ఉందా.. గ్రహ సంచారం: మిథున రాశిలో గురుడు, శుక్రుడు సంచరిస్తుండగా, కర్కాటక రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక చేస్తున్నారు. అలాగే, సింహ రాశిలో కేతువు, కన్యా రాశిలో కుజుడు, మీన రాశిలో శని సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల ప్రభావం వల్ల అనేక రాశులవారికి శుభకరంగా ఉండనుండగా, కొన్ని రాశులవారికి కొంత అననుకూలతలు కనిపిస్తున్నాయి.
గ్రహబలం తక్కువగా ఉన్నవారికి పాటించవలసిన పరిహారాలు కూడా సూచించబడ్డాయి. ఆగస్టు 10వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో, గోచార ఫలితాలు మరియు గ్రహచార స్థితిగతుల ఆధారంగా లెక్కకట్టి చెప్పబడిన రాశిఫలాలు మీకోసం…
మేష రాశి:
మేష రాశివారికి తృతీయ స్థానంలో ఉన్న గురువు అనుగ్రహం కలిసి వస్తుంది. ఈ వారం అంతా వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల పరంగా అద్భుతంగా ఉంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. శుక్ర, శనివారాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. గురువారం పెద్ద మొత్తంలో ధనలాభం సూచితమవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం. దత్తాత్రేయుని ఆరాధన, శివాలయ దర్శనం, అమ్మవారికి కుంకుమ పూజ ఈ వారంలో మంచి ఫలితాలు ఇస్తాయి.
వృషభ రాశి:
ఈ రాశివారిపై గ్రహబలం మిశ్రమంగా ఉంది. అనుకోకుండా ఇబ్బందులు ఎదురవుతాయి. సోమవారం ఒక అవకాశం అనుకోకుండా వస్తుంది, దాన్ని గట్టిగా పట్టుకోండి. గురువారం పెద్ద మొత్తంలో డబ్బు కలిసి వచ్చే అవకాశం. పితృదేవతల ఆశీర్వాదం తీసుకుని పనులు ప్రారంభించండి. భూములపై పెట్టుబడులు పెట్టే అవకాశం. రియల్ ఎస్టేట్ వారికి అద్భుతమైన కాలం. రాజకీయ నాయకులకు పదవులు లభించే అవకాశం. ఈ వారం గణపతి ఆరాధన చేయండి. శివాలయంలో ఆవునేయి దీపారాధన వల్ల శుభఫలితాలు వస్తాయి.
మిథున రాశి:
ఈ వారం అద్భుతమైన గ్రహబలం ఉంది. అనుకోని విధంగా మంచి జరుగుతుంది. శత్రు జయం. మీ మాటకు విలువ పెరిగి, మీరు చెప్పినట్టు నడుస్తుంది. స్టాక్స్‌పై పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారులకు బుధవారం గొప్ప అవకాశం కనిపిస్తుంది. ధనవృద్ధి సూచితం. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. పిల్లల గురించి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు గొప్ప కాలం. గణపతి గరిక పూజ మంచి చేస్తుంది. అమ్మవారికి పసుపు పూలతో నిత్యార్చన ఎంతో మేలు చేకూరుస్తుంది.
కర్కాటక రాశి:
ఈ వారం గ్రహబలం పాక్షికంగా ఉంది. శని వక్రదృష్టి ప్రభావం వల్ల అధికారుల ఆగ్రహానికి గురవుతారు, జాగ్రత్త. వ్యాపారాల్లో బుధ, గురువారాల్లో జాగ్రత్తగా ఉండండి, ధననష్టం సూచనలున్నాయి. శుక్రవారం కొంచెం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభంలో అనుకోని చిక్కులు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి శుభవార్తలు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వాహన డ్రైవింగ్‌లో మెలకువగా ఉండండి. రాహుకాలంలో అమ్మవారి పూజ ఇబ్బందులు తొలగిస్తుంది. రోజూ గణపతి సూక్తం చదవండి.
సింహ రాశి:
గ్రహబలం సామాన్యం. అనుకోకుండా ఒక వార్త కలవరపరుస్తుంది. బుధవారం, శనివారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. శని వక్రదృష్టి ప్రభావం తీవ్రంగా ఉంది. వృత్తి, వ్యాపారాలపై శ్రద్ధ పెట్టండి. అధికారులతో జాగ్రత్త. నమ్మినవారి నుంచి వెన్నుపోటు జరిగే అవకాశం. మిత్రులతో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఎవరితోనూ వాగ్వివాదాలకు వెళ్లవద్దు. నాలుక అదుపులో పెట్టుకున్నవాడు ప్రపంచాన్ని జయిస్తాడని తెలిసే కాలం. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. నిత్య శివారాధన మంచి చేస్తుంది.
కన్యా రాశి:
గ్రహబలం అద్భుతం. అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు చేతికందుతుంది. జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. కర్మ సిద్ధాంతం అర్థమయ్యే రోజులు. తెలిసి ఎవరికీ ద్రోహం తలపెట్టవద్దు. మీ మాటతీరు మిమ్మల్ని కాపాడుతుంది. ప్రమోషన్లకు అవకాశం. గురువారం శుభవార్త తెలుస్తుంది. తోబుట్టువులతో అనుబంధాలు బలపడతాయి. వారం ప్రారంభంలో గొప్ప శుభఫలితాలు. మీడియా, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వారికి శుభకాలం. శివారాధన చాలా మంచి చేస్తుంది.
తులా రాశి:
గ్రహబలం సామాన్యం. అనుకోని ఫలితాలు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సామాన్యం. వ్యాపారాలకు అంతగా శుభకరంగా లేదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వారాంతంలో కొంచెం బాగుంది. ఆర్థికంగా మిశ్రమకాలం. రియల్ ఎస్టేట్ వారికి కొత్త అగ్రిమెంట్లు అనుకూలం కాదు. బ్యాంకు ఉద్యోగులు లెక్కల తేడాలు జరగకుండా జాగ్రత్త. స్పెక్యులేషన్లు నష్టాలు కలిగిస్తాయి. హామీలు ఇవ్వవద్దు. శుక్రవారం పెద్ద మొత్తంలో డబ్బు లభించే సూచన. శివారాధన అనుకూల ఫలితాలు ఇస్తుంది. బిల్వపత్రాలతో శివునికి అర్చన చేయించండి.
వృశ్చిక రాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. అనేక శుభఫలితాలు కనిపించే వారం. సోమ, మంగళవారాల్లో పెద్ద మొత్తంలో ధనలాభం. వ్యాపారులకు డబ్బే డబ్బు. అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు అనుకోకుండా ప్రమోషన్లు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి భూముల లావాదేవీల్లో లాభాలు. విందు వినోదాల్లో పాల్గొంటారు. గురువారం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వారాంతంలో బంధుమిత్రులతో గడిపే అవకాశం. విదేశీ ప్రయాణాలకు అనుకూలం.
ధనుస్సు రాశి:
ఈ వారం చంద్రుడు, రాహువుల శుభదృష్టి ఉంది. ఉద్యోగులకు మంచి కాలం. ప్రమోషన్లు వచ్చే ఛాన్స్. పనికి తగ్గ గుర్తింపు. వ్యాపారులకు వారం ప్రారంభంలో అనుకూలం. ధనలాభాలు. గురు, శుక్రవారాల్లో అనుకోని ఇబ్బందులు. ఎదురుచూసే శుభవార్త వింటారు. అవివాహితులకు అనుకూలం. విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి ప్రయత్నాలు మొదలుపెట్టండి. రియల్ ఎస్టేట్, రాజకీయ నాయకులకు అనుకూలం. రోజూ విష్ణు సహస్రనామం జపించండి. వెంకటేశ్వరునికి తులసి మాల సమర్పించండి.
మకర రాశి:
గ్రహబలం అనుకూలం. గురు, శుక్ర, కుజుల శుభదృష్టి. ధనలాభాలు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులకు అనుకూలం. సోమవారం నుంచి గురువారం వరకు తలచినవి జరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి పెద్ద లాభాలు. గత పెట్టుబడులు రెట్టింపు లాభాలు. విదేశాల్లో పిల్లల విజయాలు ఆనందం. ఉద్యోగులకు గుర్తింపు. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. బుధవారం బ్రాహ్మణులకు డబ్బు, వస్త్రాల దానం. అమ్మవారి నిత్యపూజ చేయండి.
కుంభ రాశి:
గత వారంతో పోలిస్తే ఈ వారం కొంచెం శుభఫలితాలు. గ్రహబలం పాక్షికం. మంగళ, బుధవారాల్లో అనుకూలం. వ్యాపారులకు శ్రమాధిక్యం. డబ్బుకు కటకటలు. ఉద్యోగులకు కొంచెం అనుకూలం. అనుకోకుండా ఒక వ్యక్తి వల్ల అనుకూలతలు. రియల్ ఎస్టేట్, ఇనుము, సిమెంట్ వ్యాపారులకు లాభాలు. విద్యార్థులు శ్రద్ధ వహించాలి. వాగ్వివాదాలు వద్దు. సోమవారం నవగ్రహ ఆరాధన, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరునికి ఎర్ర పూల అర్చన, మిగతా రోజులు శివారాధన చిక్కులు తొలగిస్తుంది.
మీన రాశి:
ఈ వారం చంద్ర బలంతో పాటు గురు, శుక్రుల అనుకూల దృష్టి విపరీతంగా ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులకు పదవీయోగాలు. రియల్ ఎస్టేట్ వారికి భూముల లావాదేవీల్లో డబ్బు వర్షం. వ్యాపారులకు అనుకూలతలు. కొత్త పెట్టుబడులకు మంచి కాలం. స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టండి, కానీ డే మార్కెట్ వద్దు. ఆరోగ్యం బాగుంటుంది. సోమ, గురు, శుక్రవారాల్లో సంపద పెరుగుతుంది. కులదైవాన్ని ఆరాధించండి, గొప్ప ఫలితాలు వస్తాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

