Devotional

Turmeric Water Bath:పసుపు కలిపిన నీటితో స్నానం చేస్తే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..

Turmeric Water Bath:పసుపు కలిపిన నీటితో స్నానం చేస్తే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చాలా మంది ప్రతిరోజూ స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తుంటారు. ఈ పద్ధతి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది, ముఖ్యంగా స్నానం నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పసుపు శరీరంలోని ప్రతికూల శక్తిని తొలగించి, శుద్ధి చేసే గుణాలను కలిగి ఉంటుంది. స్నానం నీటిలో పసుపు కలపడం వల్ల అదృష్టం మెరుగవుతుందని చెబుతారు.

పసుపు బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. పసుపు నీటితో స్నానం చేయడం ద్వారా జాతకంలో బృహస్పతి గ్రహం బలం పొందుతుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది.

అంతేకాకుండా, వివాహం ఆలస్యమవుతున్నవారు ప్రతిరోజూ ఒక బకెట్ నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే, త్వరగా వివాహం జరిగే అవకాశం ఉందని నమ్ముతారు.

ఒక బకెట్ నీటిలో ఒక టీస్పూన్ పసుపు కలిపి స్నానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపులోని యాంటీబయోటిక్ గుణాలు, ముఖ్యంగా వర్షాకాలంలో అంటువ్యాధులను నిరోధించడంలో సహాయపడతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ