Business

Free bus in AP: ఆగస్టు 15 మధ్యాహ్నాం ఉచిత బస్సు పథకం ప్రారంభం… కీలకమైన అప్ డేట్..

Free bus in AP: ఆగస్టు 15 మధ్యాహ్నాం ఉచిత బస్సు పథకం ప్రారంభం… కీలకమైన అప్ డేట్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15న మధ్యాహ్నం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ‘స్త్రీశక్తి’ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సందర్భంగా మంగళవారం సచివాలయంలో సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రద్దీని సమర్థంగా నిర్వహించడానికి సామర్థ్యం పెంచాలని, భద్రతపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు.

మహిళలు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేందుకు జీరో ఫేర్ టిక్కెట్ సౌకర్యం కల్పించేందుకు ఈపోస్ మిషన్ల సాఫ్ట్‌వేర్‌ను ఆగస్టు 14 నాటికి అప్‌డేట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిబ్బందికి దీనిపై శిక్షణ కూడా పూర్తయింది. ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించి, పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం సూచించారు.

ఆటో డ్రైవర్లకు కొత్త పథకం
సమీక్షలో ఆటో డ్రైవర్లకు అందించే సాయంపైనా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో కలిపి, ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకాన్ని రూపొందించేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.

బస్ స్టేషన్లలో సౌకర్యాలు, భద్రత
బస్ స్టేషన్లు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, ప్రతి రెండు గంటలకొకసారి టాయిలెట్లు శుభ్రపరచాలని, చెత్త తొలగించాలని సీఎం ఆదేశించారు. తాగునీటి కోసం అన్ని బస్ స్టేషన్లలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, రూ.30 కోట్లతో బస్ స్టేషన్ల మరమ్మతులు, పెయింటింగ్ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన చోట ఫ్యాన్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని, 24 గంటలూ ఆర్టీసీ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

సాంకేతిక సౌలభ్యం, బస్సు నిర్వహణ
ఈపోస్ మిషన్లలో జీపీఎస్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసి, ఆర్టీజీఎస్‌తో అనుసంధానం చేసి ప్రయాణికులకు సమాచారం అందించాలని సీఎం సూచించారు. బస్సులు బ్రేక్‌డౌన్ కాకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడపడం ద్వారా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆటో డ్రైవర్లకు కొత్త పథకం రూపకల్పనతో పాటు, బస్ స్టేషన్లలో సౌకర్యాలు, భద్రతను మెరుగుపరచడంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ