DevotionalToday Rasi Phalalu In telugu

TODAY HOROSCOPE IN TELUGU: నేడు ఆగష్టు 13 బుధవారం రాశి ఫలాలు.. ఈ రాశులకు డబ్బు కలిసి వచ్చే అవకాశం..

TODAY HOROSCOPE IN TELUGU: నేడు ఆగష్టు 13 బుధవారం రాశి ఫలాలు.. ఈ రాశులకు డబ్బు కలిసి వచ్చే అవకాశం.. నేడు ఆగస్టు 13, 2025 – బుధవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం. తిథి: చవితి ఉదయం 6:36 వరకు, తర్వాత పంచమి తెల్లవారుజాము 4:23 వరకు. నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉదయం 10:23 వరకు, తర్వాత రేవతి. వర్జ్యం: రాత్రి 9:49 నుండి 11:19 వరకు. రాహుకాలం: మధ్యాహ్నం 12:20 నుండి 1:55 వరకు. ఈ రోజు ద్వాదశ రాశులకు చాంద్రమాన ఫలితాలు ఇలా ఉన్నాయి:

మేషరాశి:
ఈ రోజు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. వ్యాపారులకు మంచి సమయం. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. పెళ్లి కాని యువతకు సంబంధాలు కుదిరే అవకాశం. తల్లిదండ్రుల ఆశీస్సులతో పనులు ప్రారంభిస్తే శుభం. శివాలయ దర్శనం మంచిది.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: తెలుపు

వృషభరాశి:
గ్రహబలం మీకు అనుకూలం. అనుకోని ధనలాభం సూచితం. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు శుభకాలం. విద్యార్థులకు కొత్త కోర్సుల్లో చేరడానికి మంచి రోజు. అమ్మవారికి చామంతి పూలు, నిమ్మకాయల మాల సమర్పిస్తే శుభ ఫలితాలు వస్తాయి.
లక్కీ నెంబర్: 6
లక్కీ కలర్: పసుపు

మిథునరాశి:
గ్రహబలం పాక్షికంగా ఉంది. ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు ఆతురతలో పెట్టుబడులు పెట్టొద్దు. ఖర్చులు నియంత్రణలో ఉంచండి. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. ఒక వార్త ఇబ్బంది కలిగించవచ్చు. మూగజీవాలకు ఆహారం ఇవ్వండి. శివాలయ దర్శనం శుభం.
లక్కీ నెంబర్: 7
లక్కీ కలర్: నీలం

కర్కాటకరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. తలచిన పనులు సులభంగా పూర్తవుతాయి. అనుకోని ధనలాభం. పెట్టుబడులు, స్టాక్ మార్కెట్‌కు అనుకూలం, కానీ స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్‌కు శుభకాలం. విద్యార్థులు శ్రద్ధ వహించాలి.
లక్కీ నెంబర్: 5
లక్కీ కలర్: ముదురు నీలం

సింహరాశి:
గ్రహబలం పాక్షికం. బుధ-శని దృష్టి వల్ల పనుల్లో జాప్యం జరగవచ్చు. ఆర్థికంగా సమస్యలు తీరతాయి. భూములపై పెట్టుబడులకు అనుకూలం. పిల్లల చదువులపై శ్రద్ధ అవసరం. పెద్దల ఆరోగ్యంపై జాగ్రత్త.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: లేత ఆకుపచ్చ

కన్యారాశి:
గ్రహబలం అద్భుతం. ఉద్యోగులకు ప్రమోషన్లు, వ్యాపారులకు ధనలాభం. పాత పెట్టుబడులు ఫలిస్తాయి. శత్రువులతో జాగ్రత్త. రియల్ ఎస్టేట్‌కు లాభాలు. వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పిస్తే శుభం.
లక్కీ నెంబర్: 11
లక్కీ కలర్: ధవళ వర్ణం

తులారాశి:
మిశ్రమ ఫలితాలు. గ్రహబలం పాక్షికం. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది. రియల్ ఎస్టేట్‌లో దూరదృష్టితో పెట్టుబడులు పెట్టండి. రాజకీయ నాయకులకు మాటలో నియంత్రణ అవసరం. చండీమాత ఆరాధన శుభం.
లక్కీ నెంబర్: 8
లక్కీ కలర్: గచ్చకాయ రంగు

వృశ్చికరాశి:
గ్రహబలం అంత అనుకూలం కాదు. మానసిక బలం అవసరం. అనుకోని సమస్యలు రావచ్చు. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు జాగ్రత్త. ఉద్యోగులకు అనుకోని సమస్యలు. పెద్దలకు ఆస్తమా వంటి రోగాలపై జాగ్రత్త. రియల్ ఎస్టేట్, విద్యార్థులకు శుభం. గణపతి ఆరాధన మంచిది.
లక్కీ నెంబర్: 5
లక్కీ కలర్: పసుపు

ధనూరాశి:
గ్రహబలం అనుకూలం. తలచిన పనులు సఫలం. ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఇబ్బంది కలిగించే వ్యక్తిని వదిలేస్తారు. విద్యా, వైద్య, వృత్తి నిపుణులకు అనుకూలం. వ్యాపారులకు ధనలాభం. సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం శుభం.
లక్కీ నెంబర్: 7
లక్కీ కలర్: ఎరుపు

మకరరాశి:
గ్రహబలం సామాన్యం. పనుల్లో ఆటంకాలు రావచ్చు. వ్యాపారులకు రోజు నిదానంగా మొదలై, క్రమంగా అనుకూలమవుతుంది. రియల్ ఎస్టేట్‌లో ఆస్తి వివాదాలపై జాగ్రత్త. వాహన డ్రైవింగ్‌లో జాగ్రత్త. ఉద్యోగులకు మానసిక ఒత్తిడి. పంచముఖి ఆంజనేయ దర్శనం శుభం.
లక్కీ నెంబర్: 6
లక్కీ కలర్: ఆకుపచ్చ

కుంభరాశి:
గ్రహబలం సామాన్యం. తలచిన పనులు ఆలస్యమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని నిర్ణయం తలనొప్పి తెచ్చిపెడుతుంది. కొత్త వ్యాపార నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. శివుడికి ఆవుపాలు, తేనె సమర్పిస్తే చిక్కులు తీరతాయి.
లక్కీ నెంబర్: 5
లక్కీ కలర్: నీలం

మీనరాశి:
గ్రహబలం పరవాలేదు. అనుకోని సమస్యలపై జాగ్రత్త. పెద్ద వ్యాపార ఒప్పందం కుదిరే అవకాశం. ధన, వస్తు లాభాలు. స్టాక్స్‌కు దూరంగా ఉండండి. బంగారం కొనుగోలుకు అనుకూలం. కమొడిటీల్లో పెట్టుబడులు లాభిస్తాయి. వాహన కొనుగోలుకు మంచి రోజు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్‌లో భూమి పెట్టుబడులకు అనుకూలం.
లక్కీ నెంబర్: 2
లక్కీ కలర్: తెలుపు

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ