TODAY HOROSCOPE:రాశిఫలాలు 14 ఆగస్టు 2025.. ఈ రాశుల వారు అనుకున్నది సాదిస్తారు..
TODAY HOROSCOPE:రాశిఫలాలు 14 ఆగస్టు 2025.. ఈ రాశుల వారు అనుకున్నది సాదిస్తారు.. నేడు ఆగస్టు 14, 2025 – గురువారం, శ్రావణ మాసం, తిథి షష్ఠి రాత్రి 2:07 వరకు, తర్వాత సప్తమి, నక్షత్రం రేవతి ఉదయం 9:06 వరకు, తర్వాత అశ్విని, వర్జ్యం రాత్రి 3:51 నుండి ఉదయం 5:21 వరకు. చాంద్రమానం ఆధారంగా 12 రాశుల ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి:

మేష రాశి:
ఈ రోజు చంద్ర బలం మీకు అనుకూలంగా ఉంది. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా సానుకూలతలు ఉన్నాయి. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం, అనుకూలత కొంత తక్కువ. వ్యాపారులకు ఉత్సాహకరమైన రోజు. గణపతి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 5

వృషభ రాశి:
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ఉద్యోగులకు శుభ సమయం. వ్యాపారులకు అనుకోని లాభాలు, వృద్ధికి అవకాశాలు కనిపిస్తాయి. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ సలహాల వల్ల లాభం పొందినవారు మీ ప్రతిష్ఠను పెంచుతారు. దీర్ఘకాల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వేంకటేశ్వర స్వామి అర్చన చేయించండి.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 7

మిథున రాశి:
ఈ రోజు గ్రహ బలం అనుకూలంగా లేదు. ఒత్తిడులు, మానసిక ఒంటరితనం ఎదురవుతాయి. ఉద్యోగులు వివాదాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు మందగమనం. ఖర్చులకు దూరంగా ఉండండి. శివ ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 9

కర్కాటక రాశి:
గ్రహ బలం పాక్షికంగా ఉంది. ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ ఒత్తిడి ఎదురవుతుంది. స్నేహితుల వల్ల ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్త. పూర్వీకుల నుండి ఆస్తులు కలిసి రావచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. వినాయకుడికి చెరుకు, జిల్లేడు పూలు సమర్పించండి.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 5

సింహ రాశి:
చంద్ర బలం తక్కువగా ఉన్నప్పటికీ, ఇతర గ్రహాల శుభ దృష్టి వల్ల ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు అనుకూలం.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 5

కన్యా రాశి:
గ్రహ బలం సామాన్యం. పని ఒత్తిడి వల్ల అలసట ఉంటుంది. చిన్న ఉద్యోగులు మిమ్మల్ని దాటడం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఓర్పుగా ఉండండి, ప్రతికూల ఆలోచనలకు ఆదిపత్యం ఇవ్వకండి. ఆర్థిక కొరత వల్ల ఆగిన పనులు ధన సహాయంతో మళ్లీ ప్రారంభమవుతాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. రియల్ ఎస్టేట్ వారు కొత్త వెంచర్లకు దూరంగా ఉండండి. గణపతికి గరిక సమర్పించండి.
లక్కీ కలర్: గచ్చకాయ రంగు
లక్కీ నెంబర్: 9

తులా రాశి:
గ్రహ బలం అనుకూలం. తలపెట్టిన పనులు సఫలమవుతాయి. స్నేహితుల వల్ల మంచి జరుగుతుంది. అనుకోని ఖర్చు రావచ్చు. వ్యాపారులకు సానుకూల కాలం. మనస్సాక్షికి అనుగుణంగా చేసే పనులు ఫలిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం, కానీ కొత్త వ్యాపారాలకు ఈ రోజు పూర్తి అనుకూలం కాదు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.
లక్కీ కలర్: లేత నీలం
లక్కీ నెంబర్: 5

వృశ్చిక రాశి:
రవి బలం వల్ల తలపెట్టిన పనులు సాధ్యమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విజయం ఖాయం. మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు రావచ్చు. విద్యార్థులకు, రియల్ ఎస్టేట్, ఐరన్, సిమెంట్ వ్యాపారులకు అనుకూలం. రాజకీయ నాయకులకు ఈ రోజు ప్రత్యేకం. హనుమాన్ చాలీసా జపించండి.
లక్కీ కలర్: బంగారు రంగు
లక్కీ నెంబర్: 3

ధనూ రాశి:
గ్రహ బలం పాక్షికం. పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థికంగా లాభాలు కలిసి వస్తాయి. షేర్లలో పెట్టుబడులు ఫలిస్తాయి. ఉద్యోగులు శ్రద్ధగా పని చేయండి. వ్యాపారులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. స్నేహితుల వల్ల శుభాలు. దత్తాత్రేయ దర్శనం ఇబ్బందులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 5

మకర రాశి:
గ్రహ బలం సామాన్యం. ఉద్యోగ, వృత్తిలో పని ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారులు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. పంచముఖి ఆంజనేయస్వామి దర్శనం చిక్కులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: కాషాయం
లక్కీ నెంబర్: 9

కుంభ రాశి:
గ్రహ బలం చాలా అనుకూలం. తలపెట్టిన పనులు సాధిస్తారు. ఉద్యోగ మార్పులకు, విదేశీ స్థిరపడే ప్రయత్నాలకు ఈ రోజు అనుకూలం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులపై జయం సాధిస్తారు. అతి విశ్వాసం పనికిరాదు. శివ ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 9

మీన రాశి:
గ్రహ బలం చాలా అనుకూలం. పెద్ద మొత్తంలో ధనం లేదా పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం. భూములపై పెట్టుబడులకు అనుకూలం. చంద్ర బలం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్ద లక్ష్యాలు పెట్టుకుని నిరుత్సాహపడకండి. కొత్త అవకాశం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సుందరకాండలో ఒక శ్లోకం జపించండి.
లక్కీ కలర్: లేత ఎరుపు
లక్కీ నెంబర్: 5
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

