Gold Price Today: గోల్డెన్ న్యూస్.. బంగారం కొనాలా.. కోనేయండి.. ఆలస్యం చేయకండి..
Gold Price Today: గోల్డెన్ న్యూస్.. చౌక.. చౌక.. బంగారం కొనాలా.. కోనేయండి.. ఆలస్యం చేయకండి.. చౌక.. చౌక.. బంగారం ధరలు నేల చూస్తున్నాయి! గత నాలుగు రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా సుమారు రూ. 18,000 వరకు బంగారం ధరలు పడిపోయాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి, ఒకసారి చూడండి.

బంగారం ప్రియులకు, ముఖ్యంగా మహిళలకు ఆనందకరమైన వార్త! గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నీలి కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ స్థితిగతులు, ట్రేడ్ వార్ దాదాపు ముగియడం, యూఎస్ ఆర్థిక డేటా, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ఫెడరల్ రిజర్వ్ రేట్లు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. గత నాలుగు రోజుల్లో 100 గ్రాముల బంగారం ధర రూ. 18,000 వరకు తగ్గింది.

కృష్ణాష్టమి, వినాయక చవితి సమీపిస్తున్న తరుణంలో బంగారం కొనుగోలుదారులకు ఇది శుభవార్త. స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. గత రెండు రోజుల్లో వెండి ధర కిలోకు రూ. 1,100 పెరిగింది. ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,490గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,040గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,340, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,890గా ఉంది. బెంగళూరు, చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,340, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,890గా కొనసాగుతోంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,340, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,890గా ఉంది.

వెండి ధరల వివరాలు:
బంగారం ధరలు తగ్గుతుండగా, వెండి ధరలు ఆకాశమే అంటుతున్నాయి. కిలో వెండి ధర రూ. 1,100 పెరిగింది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 1,16,100గా ఉంది. హైదరాబాద్, కేరళ, చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,26,100గా కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. తాజా బంగారం ధరల కోసం 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

