DevotionalToday Rasi Phalalu In telugu

TODAY HOROSCOPE:ఆగష్టు 16 శనివారం రాశి ఫలాలు… ఈ రాశి వారికీ కష్టాలు వచ్చే అవకాశం..

TODAY HOROSCOPE IN TELUGU:ఆగష్టు 16 శనివారం రాశి ఫలాలు… ఈ రాశి వారికీ కష్టాలు వచ్చే అవకాశం.. కొంత మంది జాతకాలను నమ్ముతారు. మరి కొంత మంది జాతకాలను అసలు నమ్మరు. ఈ ఆర్టికల్ జాతకాలను నమ్మే వారి కోసం మాత్రమే..

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం..

తిథి: అష్టమి రాత్రి 9:35 వరకు, తర్వాత నవమి

నక్షత్రం: భరణి ఉదయం 6:05 వరకు, తర్వాత కృత్తిక

వర్జ్యం: సాయంత్రం 5:21 నుండి 6:51 వరకు

దుర్ముహూర్తం: ఉదయం 7:43 నుండి 8:34 వరకు

రాహుకాలం: ఉదయం 9:11 నుండి 10:46 వరకు

యమగండం: మధ్యాహ్నం 1:54 నుండి 3:29 వరకు

మేషరాశి:
ఈ రోజు గ్రహబలం సాధారణంగా ఉంది. కొంత శత్రుభయం ఉండవచ్చు. అనుకోని ఇబ్బందులు ఎదురవొచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థితి బాగుంది. ఒక వార్త మీకు ఆందోళన కలిగించవచ్చు. చేతివృత్తుల వారికి మంచి రోజు. ప్రైవేట్ ఉద్యోగులు పనిలో శ్రద్ధ వహించండి. కొత్త పెట్టుబడులకు ఈ రోజు అనుకూలం కాదు. రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన చేయండి, చిక్కులు తొలగుతాయి.
అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య: 9

వృషభరాశి:
శుక్రుడి శుభ ప్రభావంతో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకోని ధనలాభం సూచన ఉంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. వ్యాపారులకు శుభ సమయం. రాజకీయ నాయకులకు మాటకు విలువ పెరుగుతుంది, అధిష్ఠానం నుండి పిలుపు రావచ్చు. భూముల కొనుగోలుకు మంచి సమయం. కనకధారా స్తోత్రం పఠించండి, మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.
అదృష్ట రంగు: ఎరుపు
అదృష్ట సంఖ్య: 6

మిథునరాశి:
ఈ రోజు మీకు అనేక శుభ ఫలితాలు ఉన్నాయి. బుధుడి శుభదృష్టి వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారులకు అనుకూలం, కానీ ఒక వ్యక్తి వల్ల అవమానం ఎదురవొచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. ఉద్యోగులకు అద్భుత రోజు, కొత్త బాధ్యతలు రావచ్చు. విద్యార్థులకు శుభకాలం. గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది.
అదృష్ట రంగు: పసుపు
అదృష్ట సంఖ్య: 8

కర్కాటకరాశి:
చంద్రుడి శుభదృష్టి పాక్షికంగా ఉంది. మానసిక ఒత్తిడి కొంత కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. డబ్బు సమయానికి సర్దుబాటవుతుంది. విద్యార్థులకు సామాన్య ఫలితాలు. రియల్ ఎస్టేట్ వారికి కొత్త వెంచర్లు ఈ రోజు అనుకూలం కాదు. అమ్మవారి ఆరాధనతో ఇబ్బందులు తొలగుతాయి.
అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య: 5

సింహరాశి:
రవి శుభదృష్టి మీపై ఉంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. రియల్ ఎస్టేట్, రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైన రోజు. అదృష్టం మీ వెంట ఉంటుంది. ధనలాభం, వజ్రాభరణాల కొనుగోలు అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి రోజు. వేంకటేశ్వరస్వామి ఆరాధనతో అనుకూలతలు పెరుగుతాయి.
అదృష్ట రంగు: పసుపు
అదృష్ట సంఖ్య: 9

కన్యారాశి:
బుధ, శుక్రుల శుభ ప్రభావంతో ఈ రోజు అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త పరిచయం వల్ల ఉద్యోగాల్లో అభివృద్ధి సూచన ఉంది. విహార యాత్రలకు అనుకూలం. వ్యాపారులకు మంచి రోజు. విద్యార్థులు శ్రద్ధ వహించండి, అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. లక్ష్మీగణపతి ఆరాధనతో శుభ ఫలితాలు కలుగుతాయి.
అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య: 6

తులారాశి:
అద్భుతమైన రోజు! శుక్రుడి శుభదృష్టి, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అన్నీ బంగారంలా మారతాయి. డబ్బు కలిసివస్తుంది, పాత పెట్టుబడులు ఫలితాలిస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి, భూముల కొనుగోలుకు అనుకూలం. లక్ష్మీదేవికి కలువపూలు లేదా చామంతి పూలు సమర్పించండి, శుభాలు జరుగుతాయి.
అదృష్ట రంగు: పసుపు
అదృష్ట సంఖ్య: 9

వృశ్చికరాశి:
గ్రహబలం పాక్షికంగా ఉంది. అనుకోని ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. కీళ్ల సమస్యలు రావచ్చు. వ్యాపారులకు అంత అనుకూలం కాదు, శ్రమాధిక్యత ఉంది. రియల్ ఎస్టేట్ వారు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
అదృష్ట రంగు: నీలం
అదృష్ట సంఖ్య: 7

ధనూరాశి:
గురుబలం బాగుంది, తలచిన పనులు జరుగుతాయి. వ్యాపారులకు లాభాలు, వృత్తి నిపుణులకు అనుకూలం. అనుకోని పెద్ద మొత్తంలో డబ్బు రావచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణుసహస్రనామ పారాయణం మంచి ఫలితాలనిస్తుంది.
అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య: 9

మకరరాశి:
శని వక్రదృష్టి ప్రభావం ఉంది, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం, వాహన ప్రమాదాల జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు దూరంగా ఉండండి, కానీ భూములపై పెట్టుబడి అనుకూలం. శివారాధన శుభ ఫలితాలనిస్తుంది.
అదృష్ట రంగు: నలుపు
అదృష్ట సంఖ్య: 7

కుంభరాశి:
శని వక్రదృష్టి ప్రభావం తీవ్రంగా ఉంది. అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో ధననష్టం జరగకుండా జాగ్రత్త పడండి. హామీలు, అప్పులకు దూరంగా ఉండండి. సహోద్యోగులతో వాగ్వివాదాలు జోలికి వెళ్ళవద్దు. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. శివాలయ దర్శనం శుభ ఫలితాలనిస్తుంది.
అదృష్ట రంగు: నీలం
అదృష్ట సంఖ్య: 11

మీనరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. గురువు శుభదృష్టితో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు, వ్యాపారులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. విద్యార్థులకు శుభకాలం. దుర్గా ఆరాధన అనుకూల ఫలితాలనిస్తుంది.
అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య: 9

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ