Hair Care Tips:ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలకుండా ఒత్తుగా, పట్టుకుచ్చులా మారడం పక్కా..!
Hair Care Tips:ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలకుండా ఒత్తుగా, పట్టుకుచ్చులా మారడం పక్కా.. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, చివర్లు చిట్లడం, మెరుపు కోల్పోవడం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. మార్కెట్లో దొరికే నూనెలు, షాంపూలు ఉపయోగించినప్పటికీ ఫలితం కనిపించకపోతే, ఒక సాధారణ హెయిర్ మాస్క్‌తో ఈ సమస్యలను అధిగమించవచ్చు.

మార్కెట్ ఉత్పత్తుల్లోని రసాయనాలు జుట్టును మరింత దెబ్బతీస్తాయి. అయితే, పెరుగు మరియు కలబందను ఉపయోగించి మీ జుట్టును మృదువుగా, ఒత్తుగా మార్చుకోవచ్చు. కలబంద మరియు పెరుగుతో తయారు చేసిన హెయిర్ మాస్క్ జుట్టుకు అందమైన రూపాన్ని అందిస్తుంది. ఈ రెండింటిలోని విటమిన్లు, ప్రోటీన్లు, హైడ్రేటింగ్ ఎంజైమ్‌లు జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తాయి.

కలబంద: జుట్టుకు ఉపశమనం కలిగిస్తుంది మరియు డ్యామేజ్‌ను నియంత్రిస్తుంది.
పెరుగు: జుట్టును బలంగా మార్చి, చిక్కులు లేకుండా స్మూత్‌గా, మెరిసేలా చేస్తుంది.

హెయిర్ మాస్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 టేబుల్ స్పూన్లు తాజా కలబంద జెల్ (కలబంద ఆకు నుంచి తీసినది లేదా మార్కెట్లో లభించేది)
3 టేబుల్ స్పూన్లు మందపాటి, తియ్యని పెరుగు
1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె
1 టీస్పూన్ తేనె
హెయిర్ మాస్క్ తయారీ విధానం:
ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, చిక్కని పేస్టులా చేయండి.దీనిలో కలబంద జెల్ కలిపి, క్రీమీగా మారే వరకు బాగా కలపండి.కావాలనుకుంటే, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె, తేనె కూడా జోడించి మరింత బాగా కలపండి.

హెయిర్ మాస్క్ అప్లై విధానం:
ముందుగా జుట్టులోని చిక్కులను దువ్వెనతో తొలగించండి.హెయిర్ మాస్క్‌ను తల నుంచి జుట్టు చివర్ల వరకు బాగా అప్లై చేయండి. బ్రష్ లేదా చేతులతో రాయవచ్చు. 10-15 నిమిషాల పాటు తలకు సున్నితంగా మసాజ్ చేయండి.
షవర్ క్యాప్ ధరించి, 30-45 నిమిషాలు ఉంచండి.కావాలనుకుంటే, వేడి టవల్‌తో తలను చుట్టవచ్చు. ఇది మాస్క్ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది.
30-45 నిమిషాల తర్వాత, గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించడం ఉత్తమం.
ఈ మాస్క్ వాడిన తర్వాత కండిషనర్ అవసరం లేదు, ఎందుకంటే కలబంద మరియు పెరుగు సహజ కండిషనర్‌లా పనిచేస్తాయి.

ఎన్నిసార్లు ఉపయోగించాలి?
వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్‌ను ఉపయోగించండి. వేసవి లేదా శీతాకాలంలో జుట్టుకు అదనపు సంరక్షణ అందిస్తుంది. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే, జుట్టు రాలడం, చిట్లడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గి, జుట్టు మెరిసేలా, అందంగా మారుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

