Beauty Tips

Skin Care Tips:ముఖం అందంగా తెల్లగా మెరిసిపోవాలంటే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి..

Skin Care Tips:ముఖం అందంగా తెల్లగా మెరిసిపోవాలంటే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి.. వర్షాకాలంలో వివిధ చర్మ సమస్యలు తలెత్తుతాయి. ముఖం కాంతి తగ్గి, నల్లగా, నీరసంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయి.ఈ సమస్యలను ఎలా నియంత్రించాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన ఫేస్ ప్యాక్‌లను ప్రయత్నించండి.

వర్షాకాలంలో చల్లని, తేమతో కూడిన వాతావరణం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా చర్మ సమస్యలు తలెత్తుతాయి. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందుకు ఉపయోగపడే కొన్ని ఇంటి చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం.

పసుపు మరియు వేప ఫేస్ ప్యాక్:
పసుపు సహజంగా ముఖానికి కాంతిని అందిస్తుంది. వేపాకులో బాక్టీరియా మరియు ఫంగస్‌ను నిరోధించే గుణాలు ఉండటం వల్ల, వర్షాకాలంలో వచ్చే మొటిమలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారీ కోసం, వేపాకులను శుభ్రంగా కడిగి, కొద్దిగా పసుపు, నీరు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్పొలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేస్తే సరిపోతుంది.

ముల్తానీ మట్టి మరియు రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:
జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరం. ముల్తానీ మట్టి చర్మంలోని అదనపు నూనెను గ్రహించి, రంధ్రాలను తెరవడానికి సహాయపడుతుంది. రోజ్ వాటర్‌లోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని చల్లబరుస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ కోసం, 2 స్పూన్ల ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత కడిగేస్తే సరిపోతుంది.

శనగపిండి, పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్:
జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ రాత్రి వేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. దీని తయారీకి, 2 స్పూన్ల శనగపిండిలో 1 స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత ముఖాన్ని కడిగేస్తే సరిపోతుంది.

కలబంద జెల్ మరియు దోసకాయ ఫేస్ ప్యాక్:
సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ ఎంతో ఉపయోగకరం. కలబంద జెల్ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది, అలాగే దోసకాయ చర్మంలో పగుళ్లు రాకుండా కాపాడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారీకి, దోసకాయ రసంలో కలబంద జెల్ కలిపి ముఖానికి రాయాలి. 15-20 నిమిషాల తర్వాత కడిగితే సరిపోతుంది.

చందనం మరియు రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:
చందనంలో ఉండే క్రిమిసంహారక గుణాలు చర్మంపై దద్దుర్లు, మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. చందనం పొడిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి, బాగా ఆరిన తర్వాత కడిగితే సరిపోతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ