Today Horoscope in Telugu:ఆగస్ట్ 17 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ అదృష్టం..
Today Horoscope in Telugu:ఆగస్ట్ 17 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ అదృష్టం.. ఈ రోజుల్లో చాలా ఏదైనా సమస్య వస్తే వెంటనే జాతకాలను చూస్తున్నారు. అయితే కొంత మంది జాతకాలను అసలు నమ్మరు.

మేషం
ప్రారంభించే పనులలో కృషి ఫలిస్తుంది. వ్యాపార యోగం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పనులను సమయానికి పూర్తి చేయాలి. ఆర్థిక లాభాలు సానుకూలంగా ఉన్నాయి. సూర్య ధ్యానం శుభప్రదం.

వృషభం
కొత్తగా ప్రారంభించే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆత్మీయుల సహకారం ప్రయోజనకరంగా ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారవచ్చు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శక్తిని ఇస్తుంది.

మిథునం
ప్రారంభించే పనులలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ముఖ్య కార్యక్రమాలలో బంధుమిత్రులను భాగస్వామ్యం చేయడం మంచిది. ఇష్ట దేవతా స్తోత్రం చదవడం శుభం.

కర్కాటకం
తోటివారి సహాయంతో లక్ష్యాలను సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలు అభివృద్ధిని తెస్తాయి. కలహాలకు దూరంగా ఉండాలి. సమయానికి నిద్ర, ఆహారం అవసరం. శివ నామస్మరణ శుభ ఫలితాలను ఇస్తుంది.

సింహం
మంచి పనులు చేపడతారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో వెనక్కి తగ్గకండి. ప్రణాళికలతో ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. గోవింద నామస్మరణ మంచిది.

కన్య
ప్రారంభించిన పనులలో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం ఉత్తమం. శారీరక శ్రమ కొంత ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. దుర్గా శ్లోకం చదవడం శుభం.

తుల
పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కొంత పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.

వృశ్చికం
శుభ భవిష్యత్తు ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో గొప్ప ఫలితాలు సాధిస్తారు. శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన శుభప్రదం.

ధనుస్సు
ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో తోటివారిని కలుపుకొని వెళితే పనులు త్వరగా పూర్తవుతాయి. మానసిక దృఢత్వం ఉంటుంది. సూర్య శ్లోకం చదవడం మంచిది.

మకరం
మిశ్రమ ఫలితాల కాలం. పనులలో ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను నివారించండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం శుభం.

కుంభం
శారీరక శ్రమ కొంత ఎక్కువగా ఉంటుంది. బంధువులతో వాదనలకు దూరంగా ఉండడం మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. శని ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది.

మీనం
మంచి ఫలితాలు లభిస్తాయి. విందు, వినోదం, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. ఇష్ట దైవ దర్శనం శుభప్రదం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

