Beauty Tips

Face Glow Tips:కేవలం 2 స్పూన్ల పాలతో మీ చర్మాన్ని అందంగా మెరిసిపోయేలా చేయవచ్చు..

Face Glow Tips:కేవలం 2 స్పూన్ల పాలతో మీ చర్మాన్ని అందంగా మెరిసిపోయేలా చేయవచ్చు.. ప్రతి అమ్మాయి తన చర్మం మెరిసేలా, అందంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకోసం ముఖానికి రకరకాల క్రీములు రాసుకుంటూ అందాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే, పచ్చిపాలు ఉపయోగించడం ద్వారా సహజంగా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.

అమ్మాయిలకు చర్మ సౌందర్యం చాలా ముఖ్యం. చర్మం మచ్చలు, మొటిమలు లేకుండా మెరిసిపోవాలని వారు ఆశిస్తారు. అయితే, రసాయనాలు కలిసిన ఉత్పత్తులను ఎక్కువగా వాడితే, దీర్ఘకాలంలో చర్మం అందవిహీనంగా మారే ప్రమాదం ఉంది. కొన్ని రసాయన ఉత్పత్తులు చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి, ఇంట్లో సులభంగా దొరికే వస్తువులతోనే చర్మాన్ని సంరక్షించుకోవడం ఉత్తమం.

కొందరు ఉదయం లేచిన వెంటనే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటారు. అప్పుడు చర్మం నిస్తేజంగా, పాలిపోయినట్లు కనిపిస్తే నిరాశ చెందుతారు. అలాంటి సమస్య ఉంటే, పచ్చిపాలతో చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. వంటగదిలో ఉన్న కొన్ని సహజ వస్తువులను పచ్చిపాలలో కలిపి ముఖానికి రాస్తే, కొన్ని రోజుల్లోనే ముఖం కాంతివంతంగా మారుతుంది.

పచ్చిపాలు + పసుపు: ఒక చిటికెడు పసుపును పచ్చిపాలలో కలిపి ముఖానికి పూయండి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చర్మంపై మచ్చలు తొలగిపోతాయి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

పచ్చిపాలు + గంధం: రెండు స్పూన్ల పచ్చిపాలలో గంధం పొడి కలిపి పేస్టులా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఐదు నిమిషాలు ఆగిన తర్వాత కడిగేయండి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

పచ్చిపాలు + తేనె: రెండు స్పూన్ల పచ్చిపాలలో కొద్దిగా తేనె కలిపి పేస్టు తయారు చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేస్తే చర్మం బంగారు రంగులో మెరుస్తుంది. వారానికి మూడు సార్లు ఈ విధంగా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.

పచ్చిపాలు + రోజ్ వాటర్: రాత్రి పడుకునే ముందు రెండు స్పూన్ల పచ్చిపాలలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాయండి. ఇది చర్మంపైని మురికిని, మృతకణాలను తొలగించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

ఈ సహజ పద్ధతులను క్రమం తప్పకుండా అనుసరిస్తే, కొన్ని రోజుల్లోనే మీ చర్మం అందంగా, కాంతివంతంగా మారడం మీరు గమనిస్తారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ