Hair Care Tips:జుట్టు సిల్కీగా మెరిసేలా ఉండాలంటే కండిషనర్ అవసరం లేదు.. ఇలా చేస్తే చాలు..
Hair Care Tips:జుట్టు సిల్కీగా మెరిసేలా ఉండాలంటే కండిషనర్ అవసరం లేదు.. ఇలా చేస్తే చాలు.. జుట్టు సిల్కీగా, మెరిసేలా ఉండాలని ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? చాలామంది షాంపూ చేసిన తర్వాత కండిషనర్ను ఎక్కువగా వాడతారు, ఇది జుట్టును సిల్కీగా చేస్తుందని వారి భావన.

అది నిజమే కావచ్చు, కానీ కండిషనర్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంత ఖర్చు చేయడానికి బదులు, కొన్ని సహజమైన ఇంటి చిట్కాలతో జుట్టును మృదువుగా, మెరిసేలా ఉంచుకోవచ్చు. ఈ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

1. ఆపిల్ సిడర్ వెనిగర్
షాంపూ చేసిన తర్వాత ఆపిల్ సిడర్ వెనిగర్‌ను ఉపయోగించండి. రెండు కప్పుల నీటిలో ఒక కప్పు ఆపిల్ సిడర్ వెనిగర్ కలపండి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో జుట్టును కడగండి. ఇది తలలో pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది, చుండ్రు, దురద సమస్యలను తొలగిస్తుంది, మరియు ధూళి, కాలుష్యం వల్ల జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. జుట్టు మృదువుగా, సహజమైన మెరుపుతో కనిపిస్తుంది.

2. గ్రీన్ టీ
గ్రీన్ టీ తాగడమే కాదు, జుట్టుకు రాసుకోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మానికి, జుట్టుకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. రెండు నుండి మూడు కప్పుల నీటిలో గ్రీన్ టీని మరిగించి, ఆ నీటిని వడకట్టండి. షాంపూ చేసిన తర్వాత ఈ నీటితో జుట్టును కడగండి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తూ, చిక్కులు తగ్గుతాయి. అలాగే, జుట్టు రాలడం, తెగిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.

3. బియ్యం నీరు
బియ్యం నీరు జుట్టును బలపరచడంతో పాటు మెరిసేలా చేస్తుంది. కొరియన్లు ఈ చిట్కాను ఎక్కువగా ఉపయోగిస్తారు. బియ్యాన్ని 24 గంటలు నీటిలో నానబెట్టి, ఆ నీటిని వడకట్టి ఒక స్ప్రే బాటిల్లో నింపండి. షాంపూ చేసిన తర్వాత ఈ నీటిని జుట్టుపై స్ప్రే చేసి, తర్వాత కడగండి. ఇలా చేస్తే జుట్టు సిల్కీగా, మెరిసేలా కనిపిస్తుంది.

4. మందార పూల నీరు
మూడు నుండి నాలుగు మందార పుష్పాలను తీసుకొని, ఒక లీటర్ నీటిలో బాగా మరిగించండి. మరిగిన తర్వాత ఆ నీటిని వడకట్టి, షాంపూ చేసిన తర్వాత జుట్టుకు రాయండి, ఆపై శుభ్రంగా కడిగేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు సిల్కీగా, మెరిసేలా మారుతుంది. అదేవిధంగా, బ్లాక్ కాఫీని నీటిలో మరిగించి, వడకట్టి, షాంపూ చేసిన తర్వాత ఆ నీటితో జుట్టును కడగండి. ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

