Devotional

Vinayaka Chaviti 2025:వినాయక పూజలో ఉపయోగించే 21 పత్రాలు ఏంటి? వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Vinayaka Chaviti 2025:వినాయక పూజలో ఉపయోగించే 21 పత్రాలు ఏంటి? వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. విఘ్నాలను తొలగించి విజయాన్ని అందించే గణపతి జన్మదినాన్ని వినాయక చవితిగా జరుపుకుంటాం. ఈ పండుగ హిందువులకు అత్యంత ముఖ్యమైన వేడుకలలో ఒకటి. భాద్రపద మాసంలో శుక్ల పక్ష చవితి రోజున జరుపుకునే ఈ పండుగ ఈ ఏడాది ఆగస్టు 27న వచ్చింది.

ఈ రోజున వినాయకుడిని 21 రకాల ఆకులతో (పత్రి) పూజిస్తారు. ఈ పత్రి పూజ విఘ్నాలను తొలగించి, కోరిన కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. అంతేకాదు, ఈ ఆకులలో ఔషధ గుణాలు ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నివారణకు ఈ పత్రి ఉపయోగపడుతుందని, ఇది మన పూర్వీకుల ముందుచూపుకు నిదర్శనమని చెబుతారు. ఈ 21 రకాల పత్రి ఆకులు మరియు వాటి ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం:

మాచిపత్రి: ఈ ఆకు సుగంధ భరితమై, వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. మాచిపత్రి నూనె జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది, ఆకలిని పెంచుతుంది, మానసిక ఆందోళన మరియు అలసటను తగ్గిస్తుంది.

ములక (బృహతీ పత్రం): దగ్గు, ఆయాసం తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని కలిగిస్తుంది, మూత్ర విసర్జనను సులభతరం చేస్తుంది, కండరాలకు బలాన్ని, వీర్యవృద్ధిని అందిస్తుంది. ములక వేసిన ఆముదం తాగితే వాతం తగ్గుతుంది. నేలములక వేరు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు నివారణకు ఉపయోగపడుతుంది.

మారేడు: ఈ చెట్టు యొక్క అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. మారేడు కాయల గుజ్జు అతిసారాన్ని తగ్గిస్తుంది, విషాన్ని నివారిస్తుంది. ఆకుల రసం మధుమేహ నివారణలో సహాయపడుతుంది.

గరిక: కలుపు మొక్క అయినప్పటికీ, ఇది శక్తివంతమైన క్రిమిసంహారిణి. అంటు వ్యాధులు, చర్మ రోగాలను నివారిస్తుంది. గరిక రసం వాంతులు, విరేచనాలను తగ్గిస్తుంది మరియు గాయాల చికిత్సకు ఉపయోగపడుతుంది. వేర్ల కషాయం గనేరియా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు.

నల్ల ఉమ్మెత్త: తేలు వంటి విష జంతువుల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఉబ్బసం, కోరింత దగ్గు చికిత్సకు ఉపయోగిస్తారు. కీళ్ల నొప్పులకు ఈ ఆకులతో కాపడం వేస్తారు. అయితే, ఇది విషప్రభావం కలిగిన మొక్క కాబట్టి, శుద్ధి చేయకుండా ఉపయోగించరాదు.

రేగు: మొలల సమస్యలకు రేగు చెక్క కషాయంలో కూర్చోబెట్టడం ఉపయోగకరం. మూత్రాశయ రాళ్లను కరిగించడానికి రేగు వేరు కషాయంలో బెరడు చూర్ణం కలిపి తాగితే ఫలితం ఉంటుంది. రేగు వేరు బెరడును మేకపాలతో కలిపి నూరి పూస్తే మంగు మచ్చలు తగ్గుతాయి.
Uttareni leaves Benefits In telugu
ఉత్తరేణి: దంత ఆరోగ్యానికి ఈ వేర్లు ఉపయోగపడతాయి. ఆకుల రసం, దిరిసెన రసంతో కలిపి తాగితే క్రిములు నశిస్తాయి. తేనెటీగ కుట్టిన చోట ఈ రసం రాస్తే ఉపశమనం కలుగుతుంది.

తులసి: జలుబు, దగ్గు నివారణకు ఉత్తమం. తేలు కుట్టిన చోట తులసి వేరును రాస్తే విషం తగ్గుతుంది. వాత వ్యాధులకు ఆకుల రసం రాయడం, తలకు పట్టించి స్నానం చేయడం వల్ల పేలు సమస్య తగ్గుతుంది.

మామిడి ఆకులు: మామిడి చిగుళ్ల రసం తేనెతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. చెట్టు జిగురు కాలి పగుళ్లకు రాస్తే ఉపశమనం కలుగుతుంది. ఆకుల కషాయం తేనెతో తాగితే గొంతు సమస్యలు తగ్గుతాయి.
Erra Ganneru Benefits In telugu
గన్నేరు: బెరడు గుండె జబ్బులు, మూత్ర వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది. వేరు గంధం చర్మ వ్యాధులు, కుష్టు వ్యాధి నివారణకు సహాయపడుతుంది.
విష్ణు కాంత: జ్వరం, దగ్గు, కఫం, ఉబ్బసం, విరేచనాల నివారణకు ఉపయోగపడుతుంది.
danimma leaf benefits
దానిమ్మ: అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, చర్మ వ్యాధులు, గొంతు నొప్పి, ముక్కు నుండి రక్తస్రావం వంటి సమస్యలకు ఉపయోగిస్తారు.

దేవదారు: క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. జ్వరం, విరేచనాల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మరువం: సుగంధ ద్రవ్యం కలిగిన మొక్క. కీళ్ల నొప్పులు, వాతం, కఫం, విష జ్వరం, చర్మ రోగాలు, గజ్జి నివారణకు ఉపయోగపడుతుంది.
Joint pains Home remedies In Telugu
వావవిలి: ఒళ్లు నొప్పులు, చెవిలో చీము, విష పురుగు కాటు, జ్వరం, కీళ్ల నొప్పులు, గాయాలు, ప్రసవ సమస్యలకు ఉపయోగపడుతుంది.
sannajaji flower benefits in Telugu
జాజి పత్రం: చెవి చీము, ఋతు సమస్యలు, వాత నొప్పులు, జీర్ణాశయ సమస్యలు, నోటి దుర్వాసన, చర్మ వ్యాధులకు ఉపయోగపడుతుంది.

దేవ కాంచనం: కుష్టు రోగ మచ్చలు, మూర్ఛ, కఫం, పొట్ట సమస్యలు, నులి పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. ఎలుక విషానికి ఆకు రసం మంచి ఔషధం.
జమ్మి: కఫం, మొలలు, కుష్టు, అతిసారం, దంత వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
Raavi aaku
రావి: సంతానోత్పత్తి, మలబద్ధకం, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు, చర్మ వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. జీర్ణ శక్తి, జ్ఞాపక శక్తిని పెంచుతుంది.

తెల్ల మద్ది: గుండె జబ్బులు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, క్షయ దగ్గు నివారణకు ఉపయోగపడుతుంది. ఆకులతో వ్రణాలకు కట్టు కడితే త్వరగా నయమవుతాయి.
jilledu
జిల్లేడు: వాతం, క్రిమి రోగాలు, శ్వాస, కాసలు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, దంత శూల, విరేచనాలు, తేలు కాటు నివారణకు ఉపయోగపడుతుంది.

గమనిక: ఈ సమాచారం మత విశ్వాసాలు మరియు పండితుల సూచనల ఆధారంగా అందించబడింది. ఇందులో శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. chaipakodi ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు.