Today Astrology:August 23 రాశి ఫలాలు-ఈ రాశి వారికి కలహాలు వచ్చే అవకాశం ఎక్కువ .
Today Astrology:August 23 రాశి ఫలాలు-ఈ రాశి వారికి కలహాలు వచ్చే అవకాశం ఎక్కువ.. ఈ రోజు ఆగస్టు 23, 2025, శనివారం, శ్రావణ బహుళ అమావాస్య, మఖ నక్షత్రం రోజు రాశి ఫలాలను తెలుసుకుందాం.

మేషం: అధికారులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అనుకోని అతిథి రాకతో కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆస్తి లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలమైన రోజు. కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం. ఉదయం శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితంలో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు.

వృషభం: కుటుంబ సభ్యులతో ఆనందమైన సమయం గడుపుతారు. వ్యాపారంలో నష్టాలు ఆందోళన కలిగించవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలు క్రీడల్లో రాణిస్తారు. స్నేహితులతో శుభకార్యంలో పాల్గొంటారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.

మిథునం: పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది. పెట్టుబడుల విషయంలో శ్రద్ధ వహించాలి. ఈ రోజు శుభవార్తలు వింటారు. అవసరానికి మించి ఖర్చు చేయకండి. సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం: పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. బంధువులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

సింహం: కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో అనుకూల నిర్ణయం రావచ్చు. అనుకోని అతిథి రాకతో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. స్నేహితులతో చిన్న పార్టీలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. మహిళలు ఉద్యోగ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. వ్యాపారంలో లాభాలతో సంతోషంగా ఉంటారు.

కన్య: కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుంచి రెట్టింపు లాభాలు వస్తాయి. డ్రైవింగ్‌లో జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులకు అధికార యోగం కనిపిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. భాగస్వామితో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి.

తుల: వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. అతిథి రాకతో కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పనులను వాయిదా వేయడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. మహిళలు పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు ఈ రోజు అనుకూలం.

వృశ్చికం: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారంలో నష్టాలు రావచ్చు. సహోద్యోగులతో వాదనలు నివారించండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రకృతిలో కొంత సమయం గడపడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. భవిష్యత్తు కోసం సమర్థవంతమైన ప్రణాళికలు వేస్తారు. భాగస్వామితో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధ్యానం, యోగా చేయడం మంచిది. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్త వింటారు.

ధనుస్సు: లక్ష్యాల సాధనలో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. పనిలో నిజాయితీగా ఉండండి. వ్యాపారంలో కొత్త ప్రాజెక్ట్ చేపడతారు. ఆత్మవిశ్వాసం కోల్పోకండి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ సంబంధిత సమాచారం అందవచ్చు. మహిళలు తమ పట్టుదలతో కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. భాగస్వామితో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. యోగా, ధ్యానం చేయడం ఉత్తమం.

మకరం: పనులను సకాలంలో పూర్తి చేయడానికి కఠిన శ్రమ అవసరం. విద్యార్థులు కష్టపడి చదవాలి. మీ కృషి, అంకితభావంతో అధికారుల ప్రశంసలు పొందుతారు. వాహనం కొనుగోలు కల నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు జాగ్రత్తగా చేయండి. వ్యాపారంలో కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. వైవాహిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. విదేశీ ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. ఎవరికీ అప్పులు ఇవ్వకండి.

కుంభం: సమాజంలో మీ మాటకు విలువ ఉంటుంది. ఆర్థిక పొదుపు అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో భాగస్వామి అభిప్రాయం తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువుల వల్ల ఆర్థిక నష్టం రావచ్చు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

మీనం: వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. విలాసవంతమైన ఖర్చులు చేస్తారు. బంధువులు మోసం చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారు. శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

