Beauty Tips

Skin Care Tips:కాఫీ పొడిని ఇలా వాడితే చాలు.. మొండి నల్ల మచ్చలు అన్నీ మాయం..

Skin Care Tips:కాఫీ పొడిని ఇలా వాడితే చాలు.. మొండి నల్ల మచ్చలు అన్నీ మాయం.. చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతారు. అయితే, కాఫీ పౌడర్‌ను ముఖ సౌందర్యానికి కూడా ఉపయోగించవచ్చు. ఇది అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మన దేశంలో చాలా మంది ఉదయం టీ లేదా కాఫీ తాగుతారు. ఇవి నిద్రమత్తును తొలగించడమే కాక, మనస్సును ఉత్తేజపరుస్తాయి. కాఫీ తాగడం వల్ల శక్తి లభిస్తుంది. ఇది ఆరోగ్యానికే కాక, చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.

కాఫీ పౌడర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. కాఫీని నేరుగా చర్మానికి అప్లై చేస్తే, చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది. దీన్ని పేస్ట్, స్క్రబ్ లేదా మాస్క్‌గా ఉపయోగించవచ్చు.

కాఫీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి చర్మాన్ని రక్షిస్తాయి. కాఫీ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ ఏజింగ్ గుణాలు
కాఫీని ముఖానికి అప్లై చేయడం వల్ల ముడతలు, సన్నని గీతలు, సూర్యరశ్మి వల్ల వచ్చే మచ్చలు, ఎరుపు వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

మొటిమల నివారణ
కాఫీ పౌడర్ ఉపయోగించడం వల్ల మొటిమల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. రెగ్యులర్‌గా ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

చర్మ శుద్ధి
కాఫీని ముఖానికి రాయడం వల్ల చర్మం లోపలి నుంచి శుభ్రమవుతుంది. ఇది చనిపోయిన కణాలను తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. కాఫీలోని కెఫిన్ రక్తప్రసరణను మెరుగుపరిచి, చర్మానికి సహజమైన గ్లో తెస్తుంది. అంతేకాదు, డార్క్ సర్కిల్స్‌ను కూడా తగ్గిస్తుంది.

కాఫీ, తేనె ఫేస్ మాస్క్
ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా రాసి, కాసేపు మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగండి. ఈ మాస్క్ ముడతలు, నల్ల మచ్చలను తొలగించి, చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

కాఫీ, పాల ఫేస్ మాస్క్
ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పాలను కలపండి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసి 15 నిమిషాలు ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపైని మురికిని తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

కాఫీ, నిమ్మరసం ఫేస్ ప్యాక్
ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగండి. ఈ ప్యాక్ ముఖాన్ని తక్షణమే అందంగా, కాంతివంతంగా చేస్తుంది.

జాగ్రత్తలు
కాఫీని కళ్ల చుట్టూ ఎట్టిపరిస్థితిలో రాయకూడదు.అలెర్జీ ఉన్నవారు కాఫీని ఉపయోగించకపోవడం మంచిది.సున్నితమైన చర్మం ఉన్నవారు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ