Daily Horoscope:August 25..12 రాశుల ఫలితాలు.. ఈ రాశి వారికీ ఆకస్మిక ధన లాభం..
Daily Horoscope:August 25..12 రాశుల ఫలితాలు.. ఈ రాశి వారికీ ఆకస్మిక ధన లాభం….నేడు ఆగస్టు 25, 2025, సోమవారం, భాద్రపద శుద్ధ పాడ్యమి, పుబ్బ నక్షత్రం. ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం.

మేషం
ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో సంతోషంగా సమయం గడుపుతారు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. బంధువులతో కొన్ని తగాదాలు రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి కష్టంలోనైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. డ్రైవింగ్‌లో జాగ్రత్త వహించండి. వస్తువులు కొనేముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనం చేస్తారు.

వృషభం
ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో విభేదాలు సంభవించవచ్చు. మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించండి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు. ప్రాపర్టీ కొనడం, అమ్మడం వంటి విషయాలకు దూరంగా ఉండండి. స్నేహితుల సహాయంతో కష్టాల నుండి బయటపడతారు. బిజీలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. పరిస్థితులు అదుపు తప్పినప్పుడు సహనంతో ఉండండి.

మిథునం
ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సమాజంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో మీ లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయండి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేసి ప్రశాంతత పొందుతారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటకం
అనుకోని బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురవొచ్చు. వ్యాపార పరంగా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఉద్యోగంలో అప్పజెప్పిన పనిలో అలసత్వం చూపవద్దు. ఇల్లు, పొలం కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి. అవకాశాలు మీ వైపే వస్తాయి. కుటుంబంలో చిన్నపాటి తగాదాలు రావచ్చు. భాగస్వామి సలహాతో పెట్టుబడులు పెట్టండి. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది.

సింహం
వ్యాపారంలో ఈ రోజు చాలా బిజీగా గడుపుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అప్పులు తీసుకున్నవారు తిరిగి చెల్లిస్తారు. ఇంటికి అవసరమైన వస్తువులు కొంటారు. పాత స్నేహితులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. విద్యార్థులు చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి.

కన్య
ఈ రోజు అనేక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పొందుతారు. వ్యాపారులకు విజయం లభిస్తుంది. సినీ రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభను అందరూ ప్రశంసిస్తారు. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది.

తుల
బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. మహిళలకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది. వాహనం కొనే అవకాశం ఉంది. సమాజంలో మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం
పెట్టుబడుల నుండి నష్టాలు రావచ్చు, కాబట్టి ఖర్చులను తగ్గించుకోండి. కుటుంబంలో విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి. మహిళలు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించండి. రాత్రి వేళల్లో వాహనం నడపడం మానుకోండి. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి శుభవార్త వింటారు.

ధనుస్సు
సాయంత్రం చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ విషయాల్లో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఊహించని ఎదురుదెబ్బలు తగలవచ్చు. మనసుకు నచ్చిన పనులు చేస్తారు. కష్టాల్లో ఉన్న స్నేహితులకు సహాయం చేస్తారు.

మకరం
ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. సినీ రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అనుకోని అతిథుల రాక వల్ల ఖర్చులు పెరగవచ్చు. సహనాన్ని కోల్పోవద్దు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు మంచి ఫలితాల కోసం కష్టపడాలి.

కుంభం
ఈ రోజు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగంలో సహోద్యోగులతో కలిసి పని చేయండి. ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ మంచి పనులు సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ఇతరులను బాధించే మాటలు మాట్లాడవద్దు. ప్రాపర్టీ కొనడం, అమ్మడం వంటి పనులను వాయిదా వేయండి.

మీనం
ఆర్థిక అవకాశాలను జారవిడుచుకోవద్దు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. పిల్లల నుండి శుభవార్త వింటారు. కృషి, పట్టుదలతో మీ లక్ష్యం వైపు సాగండి. వైవాహిక జీవితంలో పొరపాట్లకు తావివ్వవద్దు. సమాజంలో మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

