Today Telugu Horoscope: August 26 రాశి ఫలాలు – ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి
Today Telugu Horoscope: August 26 రాశి ఫలాలు – ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఈ రోజు ఆగస్టు 26, భాద్రపద శుద్ధ తదియ, మంగళవారం, హస్త నక్షత్రం. రోజువారీ రాశి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం
కుటుంబ సభ్యుల నుండి మీ పట్ల గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో ఆనందమైన సమయం గడుపుతారు. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. వ్యాపార సంబంధిత దూర ప్రయాణం చేయవలసి రావచ్చు. చిన్న చిన్న అడ్డంకులను పట్టించుకోకుండా ముందుకు సాగండి. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి.

వృషభం
ఉద్యోగులకు ఈ రోజు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆదాయం లాభదాయకంగా ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ఎవరికీ అప్పు ఇవ్వకండి, ఇస్తే సమస్యలు ఎదుర్కోవచ్చు. కుటుంబంలో విబేధాల వల్ల కొంత అశాంతి ఏర్పడవచ్చు. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.

మిథునం
పూర్వీకుల ఆస్తులు మీకు లభిస్తాయి. ఆర్థిక నిర్ణయాల్లో భాగస్వామి సలహా తీసుకోండి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. సాయంత్రం గుడికి వెళ్లి ప్రశాంతంగా గడుపుతారు. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో కొన్ని గొడవలు రావచ్చు. ఇష్ట దైవాన్ని మనసులో తలచుకోండి.

కర్కాటకం
కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. ఆఫీసులో పనులతో బిజీగా ఉంటారు. జీవిత భాగస్వామి నుండి ఊహించని బహుమతి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు నమ్మిన వారు మోసం చేయవచ్చు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

సింహం
అన్ని రంగాల్లో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వాయిదా వేసిన పనులను పూర్తి చేస్తారు. వైద్య, ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు అందుతాయి. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో నీతిగా, నిజాయితీగా పనిచేస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

కన్య
పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు. వ్యాపార నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కోపం, మాటలను అదుపులో ఉంచుకోండి. ఆరోగ్య సమస్యలు రావచ్చు. ప్రేయసితో అహంకారం విడిచిపెట్టండి. బంధువులతో గొడవలు రావచ్చు. యోగా, ధ్యానం చేయడం మంచిది. ప్రాపర్టీ విషయాలకు కొన్ని రోజులు దూరంగా ఉండండి.

తుల
కొన్ని ప్రతికూల ఫలితాలు రావచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో మీ పనితనంతో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ జీవితంలో అపార్థాలు రావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విద్యార్థులకు ఫలితాలు నిరాశపరుస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

వృశ్చికం
ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి, కానీ ఖర్చులు తగ్గించుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలు రావచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

ధనస్సు
పెట్టుబడులకు ఈ సమయం అనుకూలం. ఉద్యోగంలో మీ శ్రమకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మిత్రుల నుండి సహాయం లభిస్తుంది. నిర్ణయాలు ఆత్మవిశ్వాసంతో తీసుకోండి. ఇష్ట దైవాన్ని తలచుకోండి.

మకరం
అనేక మార్గాల నుండి ఆకస్మిక ధనలాభం లభించవచ్చు. డబ్బును దుబారా ఖర్చు చేయకుండా పెట్టుబడులు పెట్టండి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా పడతాయి.

కుంభం
రోజంతా అనుకూలంగా గడుస్తుంది. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల వల్ల వ్యాపారంలో నష్టాలు రావచ్చు. అనుకున్న పనులు పూర్తవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం, విద్యార్థులకు శ్రద్ధ అవసరం.

మీనం
ఆస్తి వివాదాలు కుటుంబ పెద్దల సహాయంతో పరిష్కారమవుతాయి. స్నేహితులకు ధన సహాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ సలహాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు విజయవంతమవుతాయి. కుటుంబ పెద్దలకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. ట్రాఫిక్‌లో జాగ్రత్తగా ఉండండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

